ప్రియుడితో కల్సి భర్తపై దాడి, ప్రియుడింట్లో మహిళ మృతి

ఈ ఘటనలో భర్తకు గాయాలయ్యాయి. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమ్మమూరుకు చెందిన శోభనాద్రి ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు చల్లపల్లి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెదికాడు. అక్కడ కూడా కనిపించకోపోవడంతో దగ్గరలోని పొలాల్లో వెతికాడు.
చెరకు తోటలో నుంచి తన భార్యతో పాటు ఆమె ప్రియుడు బయటకు వచ్చారు. దీంతో భర్త వారిద్దరిని నిలదీశాడు. భర్త నిలదీయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. ప్రియుడితో కలిసి భర్త పైన దాడికి పాల్పడింది. గాయపడిన అతన్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
ప్రియుడింట్లో ఉరేసుకొని యువతి మృతి
ప్రియుడి ఇంట్లో ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటన కృష్ణలంకలోని రణదివెనగర్‌లో సంచలనం సృష్టించింది. చిన్నారి అనే యువతికి ఏడాది క్రితం వివాహమైంది.
పెళ్లైన నెల రోజులకో ఆమె భర్తను వదిలేసింది. పెళ్లికి ముందు నుంచి పరిచయం ఉన్న రణదివెనగర్‌కు చెందిన యువకుడి ఇంటికి వెళ్లింది. అతనితో సహజీవనం సాగిస్తోంది. నాలుగు నెలలుగా వీరు వేరుగా ఉంటున్నారు. ఎన్నికల రోజైన బుధవారం అతను బాగా తాగి వచ్చి నిద్రపోయాడు. గురువారం ఉదయం నిద్ర లేచేసరికి ఇంట్లో దూలానికి చిన్నారి ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇది చూసి అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications