వ్యక్తి హత్యలో భార్య-కూతురు అరెస్ట్, అల్లుడి హత్యకి ఏఎస్సై సుపారీ
విశాఖ/విజయవాడ: ఓ వ్యక్తిని అతని భార్య, కుమార్తె కలిసి హతమార్చిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. అతనిని చంపిన ఆ తల్లీకూతుళ్లు దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించి, విఫలమయ్యారు. శనివారం మధ్యాహ్నం పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం దువ్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతను రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావించారు. పోస్టుమార్టంలో మాత్రం ఉరితీసి చంపినట్లు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
Also Read: కుక్కని రేప్ చేశాడు: వాట్సప్‌లో వీడియో హల్‌చల్
మరోవైపు, మృతుడి కుమారుడు సింహాచలం తన తండ్రి గత పదిహేను రోజులుగా కనిపించడం లేదని గుర్తించాడు. రైలు ఢీకొని మృతి చెందిన వ్యక్తిని సింహాచలం తండ్రిగా గుర్తించారు. సింహాచలం గత మూడేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు.

మీ తండ్రి కనిపించడం లేని బంధువులు చెప్పడంతో.. కొడుకు సింహాచలం పది రోజుల క్రితం వచ్చాడు. మృతుడి పేరు లక్ష్మణ్. అతనికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేశారు. దర్యాఫ్తులో మృతుడి భార్య లక్ష్మీ పైన పోలీసులకు అనుమానం వచ్చింది.
ఆమె సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఈ నెల 3వ తేదీన రాత్రిన రమణ అనే వ్యక్తితో లక్ష్మి పలుమార్లు మాట్లాడిందని గుర్తించారు. మరింత లోతుగా విచారణ జరపగా.. తన భర్త లక్ష్మణ్ తాగి వచ్చి తమను కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని, అందుకే చంపేశామని ఆమె చెప్పింది.
Also Read: శరీరం రెండు ముక్కలైనా టెక్కీ ఆత్మవిశ్వాసం చెదరలేదు
ఫిబ్రవరి 3న లక్ష్మణ్‌కు బాగా మద్యం తాగించి తాను, తనకూతురు పైడమ్మ, తన తమ్ముడు అప్పన్న, గాజవాకలో ఉంటున్న రమణ సహాయంతో అతని మెడకు ఉరివేసి చంపేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

అల్లుడిని హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన ఏఎస్సై
సొంత అల్లుడినే హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసి రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చిన ఓ ఏఎస్సై రామారావు, ఆయన నుంచి రూ.5 లక్షలు తీసుకుని రంగంలోకి దిగిన ఐదుగురు హంతకులను సత్యనారాయణపురం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
రామారావు కూతురు శ్యామ్ అనే ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన రామారావు... తన అల్లుడిని హతమారిస్తే రూ.5 లక్షల సుపారీ ఇస్తానంటూ ఐదుగురు రౌడీ షీటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో శ్యామ్‌కు బాగా మద్యం తాగించి, రైలు పట్టాలపై వేయాలని రౌడీలు పథకం రచించుకున్నారు. ఇందులో భాగంగా నిన్న రంగంలోకి దిగిన రౌడీ షీటర్లు శ్యామ్ ఉంటున్న ప్రాంతంలో తచ్చాడుతూ కనిపించారు.
వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో సత్యనారాయణపురం పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏఎస్సై రామారావు అసలు రంగు బయటపడింది. దీంతో ఐదుగురు రౌడీ షీటర్లతో పాటు రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
శేషాచలం అడవుల్లో కూంబింగ్
శేషాచలం అడవుల్లో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కందిమడుగు వద్ద పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులపై కూలీలు రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. వారి నుంచి పదిహేను దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అదనపు బలగాలను దించారు.












Click it and Unblock the Notifications