విషాదం:భార్య చనిపోయిందనే బాధతో...పిల్లలతో సహా భర్త ఆత్మహత్య
గుంటూరు:గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. భార్య చనిపోయిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే...
ఇటీవలే భార్య చనిపోయిన మనోవేదనకు గుర్తయిన భర్త ఆ తరువాత తనతో సహా ఇద్దరు బిడ్డల ఆలనాపాలనా ఎవరు చూస్తారనే మానసిక క్షోభతో ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చిన్నారులైన ఇద్దరు మగ బిడ్డలతో సహా ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్న దృశ్యం ప్రత్యక్ష సాక్షులను కన్నీరు పెట్టిస్తోంది. ఇటీవలే భార్య...కొన్ని రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులు చనిపోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే...

మంగళగిరికి చెందిన తిరువీధుల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి భార్య శిరీష అనారోగ్యంతో 12 వ తేదీన చనిపోయింది. అప్పటినుంచే భర్త లక్ష్మీనారాయణ డిప్రెషన్ కు గురయ్యాడు. ఆ క్రమంలో భార్య చనిపోయిన పిల్లలు తేజేశ్వర్, అమరేశ్వర్ తల్లి కోసం ఆవేదన చెందుతుండటం, ఇద్దరు చిన్నారులు కావడంతో వారి ఆలనా పాలనా చూసేవారు లేకపోవడం లక్ష్మీనారాయణ ను మరింత మనోవేదనకు గురిచేసింది.
ఈ నేపథ్యంలో తిరువీధుల లక్ష్మీనారాయణ తన ఇద్దరు కుమారులు తేజేశ్వర్, అమరేశ్వర్‌లకు పాలల్లో విషం కలిపి తాగించి తరువాత తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం ఎవరూ గమనించలేదు. మరునాడు ఉదయం పాలు పోసేందుకు ఇంటికి వచ్చిన వ్యక్తి వీరిని గుర్తించి చుట్టుప్రక్కలవారికి తెలపడంతో వారి ఆత్మహత్య విషయం తెలిసింది. ఈ విషయం తెలిసి అక్కడకు వచ్చిన స్థానికులు విగత జీవులుగా పడి ఉన్న తండ్రీకుమారులను చూసి కన్నీరుమున్నీరయ్యారు.












Click it and Unblock the Notifications