బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులు

హైదరాబాద్: ఓ మహిళ భర్త ఆస్తి కోసం ఊహించని ఘాతుకానికి పాల్పడింది. ఆస్తి కోసం భర్తను మట్టుబెట్టడానికి ముగ్గురు కిరాయి హంతకులను నియోగించిన 40 ఏళ్ల మహిళను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - మారిశెట్టి జయరాజ కుసుమ కుమారికి 26 ఏళ్ల బిటెక్ గ్రాడ్యుయెట్‌తో అక్రమ సంబంధం ఉంది, అతనితో కలిసి డిసెంబర్ 20వ తేదీన భర్తను చంపడానికి ఫథకం వేసింది. మహిళ నియోగించుకున్న ముగ్గురు వ్యక్తులు డిసెంబర్ 20వ తేదీన ఇంట్లో దాక్కున్నారు. మరిశెట్టి సుశీల్ కుమార్ ఇంట్లోకి రాగానే ఆ ముగ్గురు సుత్తి, స్క్యూడ్రైవర్లతో దాడి చేశారు.

 Wife hires 3 assassins to kill husband for land

41 ఏళ్ల సుశీల్ అనే భూస్వామి శవం గాంధీనగర్‌లోని బాకారంలో అతని ఇంట్లో రక్తమడుగులో పడి ఉంది. వారం తర్వాత ఆ శవం బయటపడింది. ఇంట్లో అతను ఒంటరిగానే ఉంటున్నాడు. దాంతో వారం పాటు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. కుళ్లిపోయిన అతని శవం పడక పక్కన పడి ఉంది.

పోలీసులు ఆ హత్యపై దర్యాప్తు జరుపుతున్న క్రమంలో అతని భార్యను విచారించారు. సుశీల్, జయరాజ కుమారి 1996లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం కుసుమ కుమారి ఇంట్లోంచి వెళ్లిపోయి మౌలాలిలోని తల్లిగారింట్లో ఉంటోంది. సుశీల్‌కు హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు పది కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఉంది. దాంతో అతన్ని చంపి ఆ భూమిని సొంతం చేసుకోవాలని కుసుమకుమారి భావించింది.

దాంతో కుసు కుమారి, అతని ప్రియుడు లంకా నరేష్ కుమార్ అతన్ని చంపడానికి పథకం వేశారు. హత్య చేయడానికి వొరుగంటి బాలరాజ్, పూసల రాజు, షేక్ గౌస్‌లను కిరాయికి మాట్లాడుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+