భార్యతో భర్త వ్యభిచారం, భార్య కాపురానికి రాలేదంటూ చేయి కోసుకున్న భర్త
హైదరాబాద్: ఇల్లు అద్దెకు తీసుకొని భార్యతో వ్యభిచారం నిర్వహిస్తున్న భరత్తో సహా ఆమెను, ముగ్గురు విటులను వనస్ధలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నానికి చెందిన దంపతులు వనస్ధలిపురం బీఎన్ రెడ్డి నగర్‌లోని బాలాజీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
భర్త గత కొంతకాలంగా భార్యతో అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఆకస్మికంగా దాడి చేశారు. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన హరిబాబు, మలక్ పేటకు చెందిన మాన్ కొఠారి జైన్, కొత్త పేటకు చెందిన వాసులతో పాటు భార్యభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం, నాలుగు సెల్ ఫోన్‌లు, రూ. 2400 నగదుని స్వాధీనం చేసుకున్నారు.
భార్య కాపురానికి రావడం లేదంటూ భర్త ఆత్మహత్యాయత్నం
భార్య కాపురానికి రావడం లేదంటూ ఓ భర్త ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని గాజువాక పోలీసుస్టేషనులో ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో అతడినిహుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా తన భార్య కాపురానికి రావడం లేదంటూ పలుమార్లు చేయి కోసుకున్నాడని గాజువాక పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications