అప్పుడు జరిగితే...: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఆసిఫాబాద్: ప్రియుడి సహకారంతో భర్తను చంపిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి - మల్లూరి భిక్షపతి (33)కి బాయక్కతో 16 ఏళ్ల కింద వివాహం జరిగింది. బాయక్కకు అదే గ్రామానికి చెందిన ఓ మాజీ నక్సలైట్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డు ఉన్నాడనే కారణంతో భర్త భిక్షపతిని చంపాలని బాయక్క పథకం రచించింది.

మాజీ నక్సలైట్ సహకారంతో బాయక్క ఏడాది క్రితం ఇంట్లోనే భిక్షపతిని చంపేసింది. యాదవ్, శంకర్ అనే వ్యక్తుల సాయంతో చింతలమానెపల్లి, బాబాసాగర్ గ్రామ శివారులోని వాగు ఒడ్డున శవాన్ని పూడ్చిపెట్టారు.
ఈ విషయం బాయక్క అన్నయ్య సత్తయ్యకు తెలుసు. కానీ బయటపెట్టలేద. ఏడాది వరకు గుట్టుగానే ఉంది. భిక్షపతి ఆచూకీ లభించడం లేదని అతడి సోదరుడు రెండు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముందుగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications