సోదరుడితో కలిసి మద్యం తాగించి భర్తను హత్య చేసిన మహిళ
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి వద్ద ఈ నెల 21న జరిగిన అనుమానాస్పద వ్యక్తి మృతి కేసును బిచ్కుంద పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య, బావ మరిది కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద నివాసి మీరా ఖుర్షీద్‌కు 15 సంవత్సరాల క్రితం మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్‌కు చెందిన నస్రీన్ బేగంతో వివాహమైంది.
మీరా ఖుర్షీద్ పశుమాంసం దందా చేసేవాడు. ప్రతిరోజు మద్యం తాగి భార్యను హింసించేవాడు. అతని బాధ పడలేక ఈ నెల 21న భార్య నస్రీన్ బేగం తన తమ్ముడు ఉస్మాన్ ఖుర్షీద్‌తో కలిసి ఇంట్లోనే మద్యం తాగించి మెడలో ఉన్న రుమాల్‌తో గొంతు నులిమి చంపేశారు. చిన్న కత్తితో రెండు, మూడు చోట్ల పొడిచి అదే రాత్రి మోటార్ బైక్‌పై తీసుకుని వెళ్లి కల్లాలి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో పడవేసి ఎవరో చంపివేశారని నమ్మించే ప్రయత్నం చేశారు.

అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడి భార్య, బావ మరిదిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే మీరా ఖుర్షీద్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ వివరించారు.
కాగా, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి మృతితో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పాఠశాల బస్సుపై దాడి చేశారు.












Click it and Unblock the Notifications