రేపు నంద్యాలకు జగన్, రంగంలోకి బాలకృష్ణ? డైలమాలో పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. రాయలసీమలో బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

జగన్! నన్నెందుకు కాల్చాలి, పవన్‌పై జాగ్రత్త: బాబు, సర్వేలో వైసిపికి 30 సీట్లే

బాలకృష్ణను పంపే యోచనలో చంద్రబాబు

బాలకృష్ణను పంపే యోచనలో చంద్రబాబు

ఈ నేపథ్యంలో బాలకృష్ణని నంద్యాల ప్రచారానికి పంపించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తిష్ట వేశారు. నంద్యాల ప్రతిష్టాత్మకం కావడంతో ఇరు పార్టీలో ప్రత్యేక దృష్టి సారించాయి.

వీటి ఆధారంగా ఉప ఎన్నిక!

వీటి ఆధారంగా ఉప ఎన్నిక!

ఇందులో భాగంగా బాలకృష్ణను కూడా ప్రచార రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాలలో భూమా నాగిరెడ్డి మృతి సెంటిమెంట్ కన్నా అభివృద్ధి, కులాల ఆధారంగా ఓట్లు పడనున్నట్లుగా కనిపిస్తోంది.

జగన్ వరుసగా ప్రచారం

జగన్ వరుసగా ప్రచారం

మంత్రి నారా లోకేష్ నంద్యాలలో ఇప్పటికే ఓసారి పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. జగన్ కూడా బుధవారం నుంచి వరుసగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కూడా రంగంలోకి దిగుతుండటం గమనార్హం.

ఇంకా తేల్చని పవన్ కళ్యాణ్

ఇంకా తేల్చని పవన్ కళ్యాణ్

నంద్యాల ఉప ఎన్నికల్లో మద్దతుపై రెండు రోజుల్లో చెబుతానని పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. కానీ ఆయన ఇప్పటి వరకు ఇంకా స్పందించలేదు. ఆయన ఇంకా డైలమాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన మద్దతు టిడిపికే ఉంటుందని భావిస్తున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆయన మద్దతు భూమా బ్రహ్మానంద రెడ్డికే ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Hindupuram MLA Nandamuri Balakrishna may campaign in Nandyal bypoll. AP CM Nara Chandrababu Naidu is thinking to send Balakrishna to Nandyal for campaign.
Please Wait while comments are loading...