పవన్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఏపీకి ప్యాకేజీ?: హోదా ఎందుకు సెంటిమెంట్‌గా మారింది?
అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై మూడు దశల్లో పోరాటం చేస్తామంటూ చేసిన ప్రకటన ఇటు టీడీపీ, అటు బీజేపీ నేతల్లో ఒక్కసారిగా కదలికను తెచ్చింది. ఏపీకి హోదాపై ఇప్పటి వరకు నిద్రపోతున్న బీజేపీ నేతలు నిద్రమేల్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ.. ఏమివ్వాలనే దానిపై ప్రధాని మోడీ స్వయంగా దృష్టి సారించారు.
హోదా లేదు, భారీ ప్యాకేజీ, అమరావతికి 5వేలకోట్లు: నో చెప్పిన బాబు, పవన్‌కు నో రెస్ట్!
గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రమంత్రులతో ఏపీ అంశంపై ఆయన తొలిసారి ఓ సమావేశం నిర్వహించారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. సోమ, మంగళవారాల్లో ఏపీపై వరుసగా అమిత్ షా నివాసంలో భేటీ అయిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, అరుణ్ జైట్లీ, వెంకయ్యలతో ప్రధాని మోడీ బుధవారం చర్చించారు.
''ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుద్దాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఏపీ ప్రజలంతా సంతృప్తి చెందే విధంగా నిర్ణయం తీసుకుందాం. ప్యాకేజీకి సంబంధించి అధికారులు తుది లెక్కలను ఖరారు చేసిన తర్వాత వీలైనంత త్వరగా ప్రకటన చేద్దాం'' అని ఈ సందర్భంగా మోడీ స్పష్టమైన ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోను, ఏపీ బీజేపీ నేతలతోను పలు దఫాలుగా జరిపిన చర్చలు, తదనంతరం తీసుకున్న నిర్ణయాలన్నిటితో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక నివేదిక రూపొందించి బుధవారం జరిగిన సమావేశానికి తీసుకొచ్చారు. ఆ నివేదికను ప్రధాని మోడీకి అందజేశారు.

హోదాపై పవన్ కళ్యాణ్ గళం
ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై కేంద్ర మంత్రి సుజనాచౌదరి మంగళవారం తనకు అందజేసిన ఐదు పేజీల ముసాయిదాను కూడా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రధానికి అందజేశారు. ఏపీకి హోదా, ప్యాకేజీలపై ప్రధాని మోడీ ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది.

హోదా ఎందుకు సెంటిమెంట్‌గా మారింది?
ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? హోదా అంశం ఎందుకు సెంటిమెంట్‌గా మారింది? ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? తదితర ప్రశ్నలను ఆయన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులను ప్రశ్నించినట్లుగా తెలిసింది. వీటితో పాటు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చేయాల్సిన ఆర్థిక సాయంతో పాటు రైల్వేజోన్ ఏర్పాటు లాంటి అన్ని అంశాలపై చర్చించారు.

మోడీతో వెంకయ్య నొక్కి చెప్పారు
ఈ సమావేశంలో ఏపికి చేయాల్సిన సాయంపై వెంకయ్య మరోసారి ప్రధానికి వివరించారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభం కన్నా, ఏపీకి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారు. విభజన కారణంగా నష్టపోయిన ఏపీని కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుందా? అని రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని మోడీతో చెప్పినట్టు తెలుస్తోంది.

అమిత్ షా అభిప్రాయం
వివిధ అంశాలపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. మొత్తం కూలంకుషంగా చర్చించిన అనంతరం ఏపీకి ఏమేమి ఇస్తామనే దానిపై ‘ప్రత్యేక' నివేదిక సిద్ధం చేయడానికి ప్రధాని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మోడీ ముందుకు జైట్లీ నివేదిక
దీంతో ఏపీకి ఏమివ్వాలనే దానిపై రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లేనని, ఇక అధికారులు నివేదకను రూపొందించడమే మిగిలి ఉందని అంటున్నారు. దీనిపై కేంద్రం సెప్టెంబర్ 2న ఓ ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ 2 జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం విశేషం.

గురువారం చంద్రబాబుతో వెంకయ్య భేటీ?
గురువారం చంద్రబాబుతో వెంకయ్య భేటీ?
మరోవైపు గురువారం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారు. ఈ భేటీలో బుధవారం నాడు తీసుకున్న కీలక నిర్ణయాలను చంద్రబాబుకు వివరించే అవకాశం ఉంది. బుధవారం జరిగిన సమావేశంలో కేంద్రం చంద్రబాబుకు ఇచ్చే హామీలివే
* విభజన కారణంగా ఏపీలో ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీని పూర్తి చేయడం
* ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీల కన్నా మెరుగైనవి ఇవ్వడం
* రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.4వేల నుంచి రూ.5 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు
* ఏపీ బీజేపీ నేతలతో చర్చలు ప్రత్యేక హోదా బదులు భారీ ప్యాకేజీ ఇచ్చే అవకాశం
* వీటితోపాటు ఏపీకి ఇంకా ఏం చేయాలో చర్చిస్తున్నారు












Click it and Unblock the Notifications