వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య ఔట్: కొత్త ట్విస్ట్. మోడీపై కేసీఆర్-బాబులు ఒక్కటవుతున్నారా?

ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్నారు.

చదవండి: జగన్ వద్దకు ప్రశాంత్ కిషోర్: బిజెపి నేత ఐడియానా, బాబుకు చెక్?

ఈ నేపథ్యంలో తమ తమ సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏపి - తెలంగాణ ప్రభుత్వాలు ఒక్కటిగా ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది.

పెద్ద దిక్కు వెంకయ్య ఉప రాష్ట్రపతిగా వెళ్తుండటంతో...

పెద్ద దిక్కు వెంకయ్య ఉప రాష్ట్రపతిగా వెళ్తుండటంతో...

వెంకయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ప్రకటించడంతో తెలుగా రాష్ట్రాల మధ్య స్నేహం బలపడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ మధ్య ఉన్న వివాదాలను కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునే ఆలోచనతో ఉన్నాయంటున్నారు. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు వెంకయ్య పెద్ద దిక్కుగా ఉన్నారు. చాలా అంశాల్లో ఆయన లాబీయింగ్ ఉపయోగపడింది.

Recommended Video

Chandrababu Naidu Is Better Than KCR! | Oneindia Telugu
'కలిసి' భర్తీ చేసుకోవాలని

'కలిసి' భర్తీ చేసుకోవాలని

ఇప్పుడు వెంకయ్య క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్న నేపథ్యంలో ఆ లోటును 'కలిసి' భర్తీ చేసుకోవాలని కేసీఆర్ - చంద్రబాబులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో తమకు బలమైన వాయిస్ ఇప్పుడు లేకుండా పోతోంది. వేర్వేరుగా వెళ్లినా, ఇరురాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోయినా.. కేంద్రంపై పోరాడే బలం తగ్గుతుంది. ఇరు రాష్ట్రాలు కలిస్తే బలం పెరుగుతుందని, అప్పుడు గట్టిగా పోరాడవచ్చునని అంటున్నారు.

తెర వెనుక మంత్రాంగం

తెర వెనుక మంత్రాంగం

విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఇష్యూలు, అలాగే, కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఎన్నో పెండింగులో ఉన్నాయి. తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని, కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై కలిసి పోరాడేందుకు ఇరువురు చంద్రులు చేతులు కలపనున్నారని అంటున్నారు. మారిన పరిణామాల నేపథ్యంలో (వెంకయ్య ఉప రాష్ట్రపతిగా వెళ్తుండటం) నియోజకవర్గాల పెంపు వంటి అంశాలపై కేంద్రం మీద ఇరువురు కలిసి ఒత్తిడి చేస్తేనే కొంత ఫలితం ఉంటుందని ఇద్దరు చంద్రులు భావిస్తున్నారని సమాచారం. ఇందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తోందని అంటున్నారు.

జుత్తు చేతికివ్వవద్దని..

జుత్తు చేతికివ్వవద్దని..

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతి గొడవను కేంద్రం వద్దకు తీసుకు వెళ్లి జుట్టు వారి చేతికి ఇవ్వవద్దని భావిస్తున్నారని సమాచారం. విభజన సమస్యలను సాధ్యమైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

లోకేష్ - కేటీఆర్ ట్వీట్లపై చర్చ

లోకేష్ - కేటీఆర్ ట్వీట్లపై చర్చ

సోమవారం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. దానికి కేటీఆర్.. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కలిసి పని చేద్దామని రీట్వీట్ చేయడం గమనార్హం. ఇది చర్చనీయాంశంగా మారింది.

బలపడాలనుకున్న బిజెపికి మొదట్లోనే కౌంటర్

బలపడాలనుకున్న బిజెపికి మొదట్లోనే కౌంటర్

తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది. వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్నంతకాలం టిఆర్ఎస్, టిడిపిలతో సత్సంబంధాలు నెరిపేలా సమన్వయం చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు బిజెపి మరీ దూకుడుగా వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో మొదట్లోనే బిజెపికి గంతలో కంటే గట్టిగా కౌంటర్ ఇస్తూ వెళ్తే బావుంటుందని చంద్రబాబు - కేసీఆర్‌లు భావిస్తున్నారు.

English summary
It is said that Andhra Pradesh CM Nara Chandrababu Naidu and Telangana CM Kalvakuntla Chandrasekhar Rao are ready to align to fight with Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X