రోజా ఇలాకాలో సీన్ ఛేంజ్, లేటెస్ట్ రిపోర్ట్ - సీఎం జగన్ నిర్ణయంపై ఉత్కంఠ..!!
వై నాట్ 175. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల నినాదం. ప్రతీ నియోజకవర్గంపైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు అందుతున్న నివేదికలతో అలర్ట్ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజకవర్గం నగరి లో పార్టీ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అటు టీడీపీ, జనసేన మంత్రి రోజాను ఓడించాలనే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
నగరిలో కొత్త సమీకరణాలు: మంత్రి రోజా నగరంలో స్వపక్షం నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రోజా 2,708 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్ధి గాలి బాను ప్రకాశ్ పైన గెలుపొందారు. జగన్ అధికారంలోకి రావటంతో రోజాకు మంత్రిపదవి ఖాయమని అందరూ భావించారు. కానీ, తొలి విడతలో దక్కలేదు.

రెండో విడత కేబినెట్ లో రోజాకు మంత్రి పదవి పైన చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు చివరికు మంత్రి పదవి దక్కింది. సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ పైన విరుచుకుపడే రోజా ను టీడీపీ, జనసేన టార్గెట్ చేసాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి.
ప్రతిపక్షాలకు టార్గెట్ గా రోజా: నగరిలో ప్రత్యర్ధి పార్టీల ఎత్తుల కంటే సొంత పార్టీ నేతల నుంచే రోజా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తన ఇబ్బందుల పైన పలు సందర్భాల్లో రోజా ఏకరువు పెట్టారు. నేరుగా సీఎం జగన్ ను కలిసి తన నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి విషయంలో రోజా ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి.

వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నా...సొంత పార్టీలోని వ్యతిరేకులను మాత్రం తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన వైసీపీలోని కొందరు నేతలను ఎలాగైనా ఓడించాలంటూ హిట్ లిస్ట్ సిద్దం చేసుకున్నాయి. అందులో కొడాలి నాని, వంశీ, రోజా, పెద్దిరెడ్డి, జోగి రమేశ్, ద్వారంపూడి, అంబటి రాంబాబు వంటి వారు ఉన్నారు.
సీఎం జగన్ పర్యటన వేళ ఉత్కంఠ: ప్రత్యర్ధి పార్టీలు టార్గెట్ చేస్తున్న మంత్రి రోజాను గెలిపించుకోవంటం ఇప్పుడు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అయితే, నగరిలో మాత్రం భిన్న రాజకీయం నడుస్తోంది. ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీ నేతల విషయంలో సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది. కీలకమైన ఎన్నికల వేళ సీఎం జగన్ ఈ నెల 28న నగరి పర్యటనకు వస్తున్నారు.

విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో నగరి అభ్యర్ధిగా రోజా గెలుపు బాధ్యతల పైన సీఎం ప్రస్తావించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరిలో తాజా పరిస్థితులపైన లేటెస్ట్ రిపోర్ట్స్ తో పూర్తి అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తన నగరి పర్యటనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications