నవీన్ పట్నాయక్ డిసైడ్ అయ్యారు - సీఎం జగన్ ఏం చేయబోతున్నారు..!?

ముందస్తు ఎన్నికల పైన మరోసారి చర్చ మొదలైంది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగానే లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జాతీయ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఒడిషా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ లోను ముందస్తు ఉంటుందనే ప్రచారం నడుమ సీఎం జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది.

ముందస్తు ప్రచారం:మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాలతో పాటే లోక్సభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీహార్ సీఎం నితీష్, బెంగాల్ ముఖ్యమంత్రి మమత అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లు రిజర్వ్ చేసుకుందని మమతా చేసిన వ్యాఖ్యతో ఒక్కసారిగా ముందస్తు ప్రచారం ఊపందుకుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ముందస్తుకు అవకాశం లేదని చెప్తున్నప్పటికీ, రాజకీయంగా మారుతున్న లెక్కలతో ఈ చర్చ ఇప్పుడు కీలకంగా కనిపిస్తుంది.

Will CM Jagan move for early poll for AP assembly amid Alliance politics, see details

అయిదు రాష్ట్రాలతో:లోక్ సభ తో పాటుగానే ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.అయితే ఒడిషా ప్రభుత్వం షెడ్యూల్ కంటే ముందుగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో పాటుగానే తమ రాష్ట్ర ఎన్నికలను నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఒడిశా ఎన్నికల నిర్వహణ పైన సమీక్ష నిర్వహించడంతో ఈ చర్చ మొదలైంది. నవంబర్ 15 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చేసిన ప్రకటనతో ముందస్తు హడావిడి మొదలైంది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఒడిస్సాలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఏపీలో ముందస్తు పైన మరోసారి చర్చ మొదలైంది.

ఏపీలో ఏం జరుగుతోంది:ఐదు రాష్ట్రాలతో పాటుగాని ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభం కావాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల జాబితా పైన రాజకీయంగా విమర్శలు ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తుంది. అయితే టిడిపి, జనసేన మాత్రం ఏపీలో ముందస్తు వస్తాయని ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ ఎన్నికలలోగా పూర్తి చేయాల్సిన లక్ష్యాలను ఇప్పటికే నిర్దేశించుకున్నారు.అధికార పార్టీ నేతలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో రంగంలోకి దిగుతున్న వేళ వారికి షాప్ ఇచ్చేందుకు జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారని వాదన వినిపిస్తుంది. దీంతో, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా, ముందస్తుకు అవకాశం ఉందా..సీఎం నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+