జగన్‌తో ఢిల్లీకి క్లియర్: కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరిందా?

ఇందుకు వారు చాలా ఉదాహరణలు చూపిస్తున్నారట. అధిష్టానం జగన్‌నే నమ్ముకుంటే పార్టీతో పాటు తమ పైన ప్రభావం పడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమని భావిస్తున్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అపార నష్టం జరిగిందని, జగన్ విడుదల కావడం, పార్టీ సీమాంధ్రలో పార్టీని బతికించుకునే ప్రయత్నాలు చేయక పోవడం వంటి అంశాలు సీమాంధ్ర కాంగ్రెసు నేతలను కలవరపరుస్తున్నాయి.
విభజనతో తెలంగాణలో లబ్ధి పొందనున్న కాంగ్రెసు, సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం తాకిడికి దెబ్బతిన్న కాంగ్రెసు ఈ ప్రాంతంలో నష్ట నివారణ నేరుగా సాధ్యం కాదు కాబట్టి జగన్ ద్వారా చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని పలువురు అనుమానిస్తున్నారు. జగన్-కాంగ్రెస్ అధిష్టానం మధ్య ఒప్పందం జరిగినట్లుగానే పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారట.
ఢిల్లీ పెద్దల వ్యాఖ్యలు చూసినా అలాగే కనిపిస్తోందంటున్నారు. ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో మాట్లాడుతూ.. జగన్ విడుదలను స్వాగతించారు. ఎప్పుడు ఎవరు జైళ్లో ఉండాలని కాంగ్రెసు పార్టీ కోరుకోదన్నారు. మరో ముఖ్య నేత వీరప్ప మొయిలీ జగన్‌తో పొత్తును కొట్టి పారేయలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications