• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు మెగాస్టార్ బహిరంగ మద్దతు-ఇరకాటంలో కాంగ్రెస్ ! చర్యలు తీసుకుంటారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇన్నాళ్లూ రాజకీయాలకు తాను దూరమంటూ చెప్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ విడుదల సందర్భంగా రాజకీయం తన నుంచి దూరం కాలేదని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా మరో పార్టీని నడుపుతున్న తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించేశారు. కానీ తాను ఓ జాతీయ రాజకీయ పార్టీలోనే ఉన్న సంగతి మర్చిపోయినట్లున్నారు. మరి ఆ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఇందంతా చూస్తూ మౌనంగా ఉంటుందా ?

 చిరంజీవి మార్క్ రాజకీయం

చిరంజీవి మార్క్ రాజకీయం

ఒకప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయంగా అదృష్టం పరీక్షించునేందుకు ప్రయత్నించిన చిరంజీవి.. కాలం కలిసి రాక దాన్ని మూడు రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీగా, కేంద్రమంత్రిగా మారి పూర్తిగా నిరూపించుకునే లోపే రాష్ట్ర విభజన పుణ్యమాని రాజకీయాలకే దూరం కావాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం చిరంజీవి రాజీనామా సమర్పించలేదు. దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని తమ ప్రతినిధిగా చూపిస్తూ గుర్తింపుకార్డు కూడా జారీ చేసింది. దీనిపైనా చిరు స్పందించలేదు.

 పవన్ కు మద్దతుగా వ్యాఖ్యలు

పవన్ కు మద్దతుగా వ్యాఖ్యలు

సీన్ కట్ చేస్తే ఇవాళ తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్‌లో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలీదని, పవన్ తన తమ్ముడని, మంచి నాయకుడు అవుతాడని చిరంజీవి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఏలే నాయకుడూ కావొచ్చన్నారు. పవన్ నిజాయితీ, నిబద్దత చిన్నప్పటి నుంచి తనకు తెలుసన్నారు. పవన్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు కావాలన్నారు. పవన్‌కు తన పూర్తి మద్ధతు ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. మరోక పక్క ఉండకూడదనే.. తాను రాజకీయాల నుంచి వైదొలిగానన్నారు. పవన్ రాజకీయంగా ఎదిగేందుకే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చానన్నారు.

 చిరు వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కలవరం

చిరు వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కలవరం

ఇన్నాళ్లూ చిరంజీవి తమ పార్టీలో ఉన్నారని, ఆయన రాజీనామా చేయలేదని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా భారీ షాక్ తగిలింది. అసలే తమ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఏపీలో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు జాతీయ నేతలైన జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఊమెన్ చాందీ వంటి వారు ఇక్కడికి వచ్చారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో చిరంజీవి తన మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్ కే అంటూ ప్రకటించడం వారిలో కలవరం రేపింది. చిరంజీవి పార్టీలోనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న దానిపై చర్చ జరుగుతోంది.

 చిరుపై చర్యలుంటాయా ?

చిరుపై చర్యలుంటాయా ?

గతంలో ఎంపీ, కేంద్రమంత్రి పదవులు అనుభవించి, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రతినిధిగా కొనసాగుతున్న చిరంజీవి.. మరో పార్టీకి నేతృత్వం వహిస్తున్న తన సోదరుడు పవన్ కు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే ఏపీలో కాంగ్రెస్ కు తిరిగి జవజీవాలు నింపేందుకు జాతీయ నేతలు ప్రయత్నిస్తున్న తరుణంలో చిరంజీవి డబుల్ గేమ్ ఇప్పుడు వారిని ఆలోచనలోకి నెట్టింది. అయితే చిరు తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం వెంటనే చర్యలు తీసుకోకపోయినా, వివరణ కోరే అవకాశం మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీనియర్ నేతలు త్వరలోనే స్పందించబోతున్నారు.

English summary
megastar chiranjeevi's comments in support of his brother and janasena chief pawan kalyan rages in ap politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X