Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముద్రగడ, మాజీ జేడీ మధ్యలో పవన్ - "కాపు" కాసేదెవరికి, లెక్క మారుతోంది..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇటు సీఎం జగన్ అనూహ్యంగా ఇంఛార్జ్ లను మారుస్తూ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. కాపు ఓటింగ్ పవన్ తోనే ఉంటుందనే చంద్రబాబు ఆశలకు ఈ ఇద్దరు గండి కొట్టే అవకాశం కనిపిస్తోంది.

కొత్త సమీకరణాలు : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. 'జై భారత్‌ నేషనల్‌ పార్టీ'ని స్థాపించారు. ఏపీలోని ప్రధాన పార్టీలను పేరెత్తకుండానే విమర్శలు చేసారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. మాజీ జేడీ గతంలో జనసేనలో పని చేసారు. ఎంపీగా పోటీ చేసారు. తరువాత ఆ పార్టీని వీడి ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించారు. జేడీ కొంత కాలంగా రిటైర్ఢ్ సివిల్స్ అధికారులతో పార్టీ ఏర్పాటు పైన చర్చలు చేసిన తరువాతనే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గతంలో జనసేనలో పని చేసి పార్టీ వీడిన నేతలు లక్ష్మీనారాణయణతో కలిసి వస్తామని చెప్పినట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ -జనసేనతో కలవ లేని వారి తమతో కలుస్తారనేది లక్ష్మీనారాయణ మద్దతు దారుల అంచనాగా కనిపిస్తోంది.

Will Ex JD Laxminarayana and Mudragada impact Pawan Kalyan Kapu voting in next Elections

కాపు వర్గం మద్దతెవరికి : ఇటు కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరటం దాదాపు ఖాయమైంది. ముద్రగడ లేదా ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి తాజా నిర్ణయాలతో ఇప్పుడు కాపు ఓటింగ్ పైన ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. జగన్ ను ఓడించాలంటే ప్రధానంగా గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం చూపుతారని..తమకు కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేసారు. పవన్ తో జత కట్టారు. కానీ, పవన్ కల్యాణ్ తాను సీఎం కావాలనే అభిమానులు..జనసైనకుల కోరికకు భిన్నంగా చంద్రబాబు సీఎం అవుతారని ప్రచారం చేయటం కాపు నేతల్లో పలువురికి నచ్చటం లేదు. దీంతో..వారు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది.
Will Ex JD Laxminarayana and Mudragada impact Pawan Kalyan Kapu voting in next Elections

కీలక పరిణామాలు : ఇప్పుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ వారికి ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, లక్ష్మీనారాయణ పార్టీలో ఎవరెవరు ఉంటారనేది బయటకు వచ్చిన తరువాత దీని పైన మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ నిర్ణయానికి గండి పడే అవకాశం కనిపిస్తోంది. పవన్ కారని లోకేష్ చెప్పటం పైన జనసేనానికి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న హరి రామ జోగయ్య లాంటి వారు విభేదిస్తున్నారు. దీంతో, ఇప్పుడు వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..చంద్రబాబుకు మద్దతుగా ఉన్న పవన్ ను వ్యతిరేకంచే నేతల తీరుతో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+