ఆ నైతికత జగన్‌లో లేదు, పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతాడా?: వీరశివారెడ్డి ఎద్దేవా
కడప: తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలో ఉన్న నైతికత ఆయన కొడుకు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో లేదని టీడీపీ నేత వీరశివారెడ్డి అన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతానన్న భ్రమలో జగన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
వీరశివారెడ్డి సోమవారం కమలాపురంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ ప్రజలు జగన్‌ను విశ్వసించడం లేదన్నారు.

సీఎం చంద్రబాబు గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తారని, కానీ జగన్ మాత్రం సూట్‌కేసులు మోసుకొచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తారని దుయ్యబట్టారు. జగన్ సీఎం అవడం అనేది ఒక భ్రమ మాత్రమేనని, ఆ భ్రమనుంచి జగన్ బయటపడడం మంచిదని వీరశివారెడ్డి హితవు పలికారు.












Click it and Unblock the Notifications