బాబుకు కలిసి రాలేదు, జగన్‌కు అక్కడ లోకేష్ చెక్ చెబుతారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేయనున్నారా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరికి మారనున్నారా? అంటే అవుననే చర్చ సాగుతోంది.

లోకేష్ ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మంత్రి కావడంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదని వైసిపి విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడపడంతో పాటు తాను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. అయితే లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.

లోకేష్ కోసం చంద్రబాబు త్యాగం

లోకేష్ కోసం చంద్రబాబు త్యాగం

కొడుకు కోసం చంద్రబాబు తన కుప్పం సీటును త్యాగం చేస్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు నుంచి లోకేష్ తొలుత పార్టీలో.. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని జగన్, పరోక్షంగా లోకేష్ నడిపిస్తారని అంటున్నారు.

Nara lokesh again slipped his tongue - Oneindia Telugu
వాటికి సమాధానం చెప్పాలంటే..

వాటికి సమాధానం చెప్పాలంటే..

నారా లోకేష్‌కు దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే వైసిపి నేతలు సవాళ్ విసురుతున్నారు. 2024 నాటికి వారసుడిగా ఎదగాలన్నా, వైసిపి చేసిన సవాళ్లకు సమాధానం చెప్పాలన్నా 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడమే మంచిదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా?

ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా?

ఈ నేపథ్యంలో లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచా లేక తన సొంతూరు చంద్రగిరి నుంచి పోటీ చేయనున్నారా తెలియాల్సి ఉంది. ఇవి రెండు కాకుండా పాత సెంటిమెంటును ఫాలో అవుతూ కృష్ణా జిల్లా నుంచి ఎక్కడ నుంచైనా పోటీ చేస్తారా చూడాల్సి ఉందంటున్నారు.

చంద్రగిరి అలా కలిసి రాలేదు

చంద్రగిరి అలా కలిసి రాలేదు

లోకేష్‌కు చిత్తూరు జిల్లా కోటాలోనే మంత్రి పదవి వచ్చింది. కాబట్టి ఈ జిల్లా నుంచే పోటీ చేయనున్నారని అంటున్నారు. చంద్రబాబుకు గతంలో చంద్రగిరి నియోజకవర్గం పెద్దగా కలిసి రాలేదు. 1982లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. అప్పుడు ఎన్టీఆర్ హవాలో బాబు కూడా చంద్రగిరిలో ఓడిపోయారు.

నిన్న కాంగ్రెస్ కంచుకోట... నేడు వైసిపి సీటు

నిన్న కాంగ్రెస్ కంచుకోట... నేడు వైసిపి సీటు

చంద్రగిరిలో కనీసం వేరే టిడిపి అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి చంద్రగిరి నియోజకవర్గం కంచుకోటగా ఉంటే, గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. ఇప్పడు లోకేష్‌ చంద్రగిరి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా అందుకోసమే తన కొడుకును సేఫ్ జోన్‌లో పెట్టడం కోసం టిడిపికి కంచుకోటయిన కుప్పం నుంచే లోకేష్‌ను బరిలో దింపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది చర్చ. దీనిపై ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చర్చ సాగుతోంది. చంద్రగిరి నుంచి ఎవరు పోటీ చేసినా.. వైసిపికి చెక్ చెబుతారా అని చర్చించుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Will Minister and Telugu Desam Party MLC Nara Lokesh contest from Kuppam constituency in next general elections? If Lokesh contest from Kuppam, Will Chandrababu Naidu contest from Chandragiri.
Please Wait while comments are loading...