ఆ డీలర్లతో సంబంధాలు, నా వద్ద ఆధారాలు, జైలుకు పంపిస్తా: బాబుపై విజయసాయి సంచలనం

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన వంచన వ్యతిరేక దీక్ష సభా ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకు నిద్రపోనని చెప్పారు.

Recommended Video

    2019లో అధికారంలోకి వచ్చేది మేమే : విజయసాయి రెడ్డి

    దేశంలోని హవాలా, విదేశాల్లోని ఆర్మ్‌డ్ డీలర్లతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఏప్రిల్ 30న టీడీపీ చేపట్టిన సభకు ఈ ఏడాది ఏప్రిల్ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయన్నారు. తిరుపతిలో టీడీపీ చేస్తోంది ధర్మపోరాట దీక్ష కాదని, అదొక అధర్మ సభ అన్నారు.

    నా వద్ద ఆధారాలు, యస్.. ప్రధానిని కలిశా

    నా వద్ద ఆధారాలు, యస్.. ప్రధానిని కలిశా

    తిరుమల కొండ పైన బీజేపీతో జట్టు కడుతున్న చంద్రబాబు, కొండ కింద మాత్రం కుస్తీ పడుతోందని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇది ఏం ధర్మమని ప్రశ్నించారు. చంద్రబాబుపై తాను ఢిల్లీలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను ప్రధాని మోడీని కలిసిన మాట వాస్తవమే అన్నారు.

    మరో పదిసార్లు కలుస్తా

    మరో పదిసార్లు కలుస్తా

    ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై టీడీపీ నేతలు రకరకాల ఆరోపణలు చేస్తున్నారని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రధానిని కలిశానని చెప్పారు. అవసరమైతే హోదా కోసం, విభజన హామీల కోసం మరో పదిసార్లు కలుస్తానని, ఎవరైనా కలువవచ్చునని చెప్పారు.

    చంద్రబాబు అవినీతిపై ఆధారాలు సమర్పించా

    చంద్రబాబు అవినీతిపై ఆధారాలు సమర్పించా

    చంద్రబాబు అవినీతిపై ప్రధానికి ఆధారాలు సమర్పించానని చెప్పారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబును జైల్లో పెట్టించే వరకు నిద్రపోనన్నారు. టీడీపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని, అప్పటి నుంచి ప్రతిక్షణం భయపడుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన అవినీతే ఆ భయానికి కారణం అన్నారు.

    ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధం

    ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధం

    అంతకుముందు రోజు ఆదివారం విజయసాయి మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధమని చెప్పారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితం ఏప్రిల్‌ 30, మే 1న తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన బహిరంగ సభలలో రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. దీన్ని నిరసిస్తూ సోమవారం వైకాపా ఆధ్వర్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ వంచన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

     రాజీనామా చేసి వెళ్లిపోండి

    రాజీనామా చేసి వెళ్లిపోండి

    చంద్రబాబును మించిన కుట్రదారు మరొకరు ఉండరని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏప్రిల్‌ 30 ధర్మపోరాటం రోజు కాదని, టీడీపీ నేతల ఫూల్స్‌ డే అన్నారు. తనకు రక్షణవలయంగా ఉండి ప్రజలు కాపాడాలంటూ మఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్నారని, మిమ్మల్ని మీరు రక్షించుకోలేనపుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+