తెలంగాణాలో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన టీడీపీతో కలవటానికి బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? చెప్పమ్మా .. చిన్నమ్మా
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు సంతోషాన్ని కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై టిడిపి శ్రేణులకు తమ సందేశాన్ని ఇచ్చారు.
అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో గాంధీభవన్ వద్ద సంబరాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ విజయం సాధించడంతో గాంధీభవన్ వద్ద పచ్చ జెండాలతో టిడిపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకుందని, రేవంత్ రెడ్డి కోసమే టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ నేడు ఎన్నికల ఫలితాలు సందర్భంగా టీడీపీ జెండాలు గాంధీ భవన్ ముందు కనిపించడం పై వైసీపీ శ్రేణులు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే అంటూ పేర్కొన్న ఆయన, తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించిందని తెలిపారు. ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.
అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేసిన విజయసాయి ఎన్నికలు ఎంతో దూరం లేవు. మీరు పోటీ చేస్తారా? చేయరా? చేస్తే ఏ నియోజకవర్గమో చెప్పగలరా పురంధేశ్వరి గారూ..జవాబు లేదు కదా అంటూ టార్గెట్ చేశారు. టీడీపీతో పొత్తు కుదిరితే మీ బావ గారు విడిచిపెట్టే ఏదో ఒక స్థానంలో మీరు పోటీ చేస్తుండొచ్చు అంటూనే షాకింగ్ ప్రశ్న వేశారు.
కానీ, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చిన చంద్రబాబు గారు కలిసి పోటీ చేద్దామన్నా మీ బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? చిన్నమ్మా....చెప్పమ్మా అంటూ ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు, పురంధేశ్వరి గార్ల నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS అభ్యర్థి గెలిచాడు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను కూడా BRS దక్కించుకుంది. మరి కాంగ్రెస్, బిజేపీలకు వీళ్ల వల్ల ఒరిగింది ఏమిటి? అంటూ సాయిరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications