టీటీడీలో ఏం జరిగింది అని చంద్రబాబు, పవన్ ఆరా తీస్తారా, ఈవో పరిస్థితి ఏమిటి ??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ రెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని, వారిని తక్షణం బదిలీ చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ఈసీ పట్టించుకోలేదు.
కానీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్‌కు చెందిన ఏవీ ధర్మారెడ్డిని అనే అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా లేక పోతే వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుందని, భక్తులకు దర్శనాలు చేయించడమే కష్టమవుతుందని సీఎం జగన్ ఒక లేఖ రాసిందే తడవు మరొకమాట లేకుండా ధర్మారెడ్డి డిప్యూటేషన్ గడువును పొడిగిస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసేసింది. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మే 14తో ముగుస్తుండగా ఈ ఏడాది జూన్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేసేంత వరకు టీటీడీ ఈవోగా కొనసాగేలా 6 వారాల పాటు గడువు పొడిగించింది.

రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులుండగా వారందరినీ కాదని డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసుకు చెందిన ఒక అధికారిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి అత్యంత కీలకమైన టీటీడీ ఈవో పోస్టు కట్టబెట్టడమే ఆభ్యంతరకరమైతే ఆయన లేకపోతే అసలు తిరుమల స్తంభించిపోతుందన్నట్టుగా డిప్యుటేషన్‌ను పొడిగించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. టీటీడీ ఈవోగా, టీటీడీ పరిధిలోని పలు సంస్థలకు డైరెక్టర్‌గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తూ సర్వాధికారాలూ తన చేతిలో పెట్టుకొని చక్రం తిప్పుతున్నధర్మారెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు అనే విషయం అందరికి తెలిసిందే.
వైఎస్ జగన్‌కు ధర్మారెడ్డి నమ్మిన బంటని, ఆయన ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పనులు చేసి పెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని, 'అతి సున్నితమైన' వ్యవహారాల్ని కూడా సీఎం కోసం సునాయాసంగా చక్క బెడతారని పేరుంది. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్ని కల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ కేంద్ర రక్షణ శాఖ మాత్రం ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించి, ఈఓగా కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది.

జగన్‌కు ధర్మారెడ్డి నమ్మిన బంటని, ఆయన దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పనులు చేసి పెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని, 'అతి సున్నితమైన' వ్యవహారాల్ని కూడా సీఎం కోసం సునాయాసంగా చక్క బెడతారని పేరుంది. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్ని కల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ కేంద్ర రక్షణ శాఖ మాత్రం ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించి, ఈఓగా కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది.
ఏవీ ధర్మారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇది వరకే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్ గడువు మే14తో ముగుస్తోంది. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14వ తేదీన కేంద్ర సర్వీసుకు తిరిగి వెళ్లిపోవాలి. కానీ తన ఆత్మబంధువు లాంటి ధర్మారెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేని జగన్ జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు, డిప్యుటేషన్‌ను పొడిగించాలంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మార్చి 12వ తేదీన లేఖ రాశారు. మొత్తం మీద ఏవీ ధర్మారెడ్డి మీద కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందా ? అని వేచి చూడాలని టీటీడీ అధికారులు కొందరు అంటున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications