వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుష్ట చతుష్టయంపై జగన్ చేతల దాడి మొదలు ? ఒక్కొక్కరినీ ఒక్కోలా ! 16 నెలల డెడ్ లైన్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్ జగన్ ను అన్నింటికంటే ఎక్కువగా చికాకుపెడుతున్న అంశం దుష్ట చతుష్టయం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ సమస్య ఎదుర్కొంటున్న జగన్ ఓ దశలో వీరిపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు సైతం ఫిర్యాదుచేశారు. అంతేకాదు రహస్యంగా ఉంచాల్సిన ఫిర్యాదును సైతం బహిరంగం చేసేశారు. అయినా జగన్ పై దుష్ట చతుష్టయంగా పేర్కొంటున్నవారి నుంచి దాడి మాత్రం ఆగలేదు. దీంతో ఎన్నికలకు ముందు ఎలాగైనా వీరి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న జగన్ ఇప్పుడు వీరిపై ప్రత్యక్ష దాడిని ప్రారంభించినట్లే కనిపిస్తోంది.

జగన్ వర్సెస్ దుష్టచతుష్టయం

జగన్ వర్సెస్ దుష్టచతుష్టయం


ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఇంకాచెప్పాలంటే విపక్ష నేతగా ఉన్నప్పటినుంచి ఆయన్ను టార్గెట్ చేస్తూ వచ్చిన కొన్ని మీడియా సంస్ధలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు అన్నీ ఇప్పుడు మరింత టార్గెట్ చేస్తున్నాయి. ప్రతీ రోజూ అత్యంత సమన్వయంతో జరుగుతున్న ఈ దాడి వైసీపీ ప్రభుత్వాధినేతను చికాకు పెడుతోంది. ముఖ్యంగా ఎన్నికలకు 16నెలలే గడువున్న నేపథ్యంలో దుష్టచతుష్టయంగా చెబుతున్న వీరి దాడిని అడ్డుకోవడంలో విఫలమైతే జగన్ విజయావకాశాలు మాత్రం తీవ్రంగా ప్రభావితం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

అడ్డుకోలేకపోయిన జగన్ !

అడ్డుకోలేకపోయిన జగన్ !

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో దుష్ట చతుష్టయంగా పేర్కొంటున్న ప్రత్యర్ధి పార్టీలు, మీడియా ఛానళ్లు చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మీడియాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త జీవోలు తీసుకొచ్చారు. అయినా వాటిని అమలు చేయలేకపోయారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాల్ని వరుసగా కోర్టుల్లో సవాల్ చేస్తూ చికాకుపెడుతున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోయారు. చివరికి వారి దుష్ప్రచారం తప్పని చెప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నించే పరిస్దితి కూడా లేదు. ఈ విషయంలో క్షేత్రస్దాయిలో వైసీపీ నేతల్ని నమ్ముకునే పరిస్ధితి కనిపించడం లేదు. దీంతో జగన్ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు.

చేతల దాడి మొదలుపెట్టిన జగన్ ?

చేతల దాడి మొదలుపెట్టిన జగన్ ?

ఇప్పటివరకూ బహిరంగసభల్లో ప్రజలకు తాను మేలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటోందని ఆరోపిస్తున్న జగన్, దీంతో పెద్దగా మేలు జరగకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఇక చివరి అస్త్రంగా చేతల దాడి మొదలుపెట్టారు. తాజాగా రెబెల్ ఎంపీ రఘురామపై గతంలో నమోదు చేసిన దేశద్రోహం కేసులో ఉన్న టీవీ ఛానళ్లను విచారణ పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అనంతరం రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధలపై నిన్న తనిఖీలు చేయించారు. విమర్శలు రాకుండా మిగతా చిట్ ఫండ్స్ లో సైతం దాడులు చేశారు. ఓవైపు రాజకీయంగా మూడు రాజధానుల పేరుతో టీడీపీ, జనసేనను నిత్యం టార్గెట్ చేస్తున్న జగన్.. ఇప్పుడు మీడియాను సైతం ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం సంచలనం రేపుతోంది.

 జగన్ కు 16 నెలలే గడువు ?

జగన్ కు 16 నెలలే గడువు ?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు మరో 16 నెలల గడువు మిగిలి ఉంది. ఆ లోపు దుష్ట చతుష్టయంగా చెబుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మరో రెండు మీడియా సంస్ధల్ని ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం ద్వారా కనీసం వాటి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే కొత్త ఏడాదిలో ఈ దూకుడు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా దుష్టచతుష్టయంతో తాడోపేడో తేల్చుకునేందుకు జగన్ కొత్తదారులు వెతుకుతున్నట్లు అర్ధమవుతోంది. ఇవి ఎంత వరకూ ఫలిస్తాయో తెలియదు కానీ.. వాటి దూకుడుకు కొంతమేరైనా అడ్డుకట్ట పడితే అది అధికార వైసీపీకి ఊరటనిస్తుందని మాత్రం అనుకోవచ్చు.

English summary
ap cm ys jagan seems to begin direct attack on his 'evil four' including yellow media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X