వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ముందస్తు ఖాయమే? జగన్ ఢిల్లీ టూర్ వేళ నిఘాకు కీలక సంకేతం ! ముహుర్తం అప్పుడే !

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం క్లైమాక్స్ కు వచ్చినట్లే కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైకి ఏమీ కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం అంతా గుట్టుగా జరిగిపోతోంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ సందర్బంగా దీనిపై ఊహాగానాలు వచ్చాయి. అయితే ఢిల్లీలో అవి నిజమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ముందస్తుపై మరింత స్పష్టత రాబోతోంది.

 ఏపీలో ముందస్తు ఎన్నికలు

ఏపీలో ముందస్తు ఎన్నికలు

ఏపీలో ముందస్తు ఎన్నికలపై గత ఏడాదిగా ప్రచారం జరుగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాటి జోరు మరింత పెరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే వైసీపీ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించి జనంలోకి వెళ్లడాన్న గమనించిన విపక్షాలు.. ఆరు నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే అనేలా ఈ పరిణామాలున్నాయి.

 జగన్ ఢిల్లీ టూర్ వేళ

జగన్ ఢిల్లీ టూర్ వేళ

సీఎం జగన్ తాజాగా ఢిల్లీ టూర్ కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. ఈ టూర్ లో ముందుగా మోడీతో భేటీ అయిన జగన్.. ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలోనూ దీనికి అనుబంధంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో జగన్ ఢిల్లీ టూర్ లో ముందస్తుకు అనుమతి తెచ్చుకోబోతోతున్నారనే చర్చ జోరుగా సాగింది. రెండు రోజుల టూర్ ముగించుకుని జగన్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. అయితే జగన్ ఢిల్లీలో ఉండగానే ముందస్తుపై రాష్ట్రానికి కీలక సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

 నిఘాకు ముందస్తు సంకేతం ?

నిఘాకు ముందస్తు సంకేతం ?

జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నిఘా వర్గాలకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం ముందస్తు ఎన్నికలకు తగినట్లుగా క్షేత్రస్ధాయిలో నిఘా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సిబ్బంది నియామకం, మార్పులు, చేర్పులు, మోహరింపులు ఉండాలని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. అలాగే నిఘా వర్గాలకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవి సాధారణంగా జరిగే డ్రిల్ కాదని, ముందస్తు ఎన్నికల కోసమే ఈ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుపై చర్చ మరింత పెరిగింది.

 ముందస్తుపై వైసీపీ నేతల సంకేతాలు ?

ముందస్తుపై వైసీపీ నేతల సంకేతాలు ?

అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీలో కీలక నేతలు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బయటికి మాత్రం ముందస్తు ఎన్నికల సమస్యే లేదని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు.. అంతర్గంతగా మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగుస్తుంది. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది.

 ముందస్తుకు ముహుర్తం అదేనా ?

ముందస్తుకు ముహుర్తం అదేనా ?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై వైసీపీ సర్కార్ ముహుర్తం కూడా నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సరికి మార్చి గడిచిపోతుంది. అదే సమయంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికలపై ప్రకటన వచ్చేలా చూసుకుంటే మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలకు వెళ్లొచ్చనే భావనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సంకేతాలను గమనిస్తే విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు కూడా ఇదే అంశాన్ని గత కొంతకాలంగా అంతర్గతంగా అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభమైతే ఒకేసారి తండ్రీ కొడుకులు జనంలోనే ఉండేందుకు వీలవుతుంది. అదే సమయంలో పవన్ కూడా వారాహితో యాత్ర మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.

English summary
ys jagan led ysrcp govt may decided to go for early election in the state. there are rumours on govt has given indications on the same to intelligence wing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X