విభజనపై ససేమీరా: కిరణ్ పార్టీ పెడితే జగన్‌కు షాకేనా?

Kiran Kumar Reddy - YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తప్పదా? అంటే అవునని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారట. సమైక్యవాదంతో కిరణ్ సీమాంధ్ర ప్రజల్లో హీరో అయిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ పెడితే అనూహ్య విజయం దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారట.

మొదట తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని, ఆ తర్వాత సమన్యాయం, అనంతరం సీమాంధ్రలో సమైక్య ఉధృతి చూసి వైయస్ జగన్ సమైక్యవాదం ఎత్తుకున్నారని, అదే కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నారని అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెడితే పుంజుకోవడం ఖాయమని చెబుతున్నారు. జగన్ పార్టీ నుండి కూడా చాలామంది నేతలు వస్తారని కొందరు భావిస్తున్నారట.

శనివారం సిఎల్పీ కార్యాలయంలో ఓ నేత విలేకరులతో ఇష్టాగోష్టీగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారట. జగన్ వైఖరిని తట్టుకోలేని పలువురు నేతలు గత్యంతరం లేకనే ఆ పార్టీలో కొనసాగుతున్నారని, కిరణ్ పార్టీ పెడితే అందులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విభజనకు ఆయన ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనను బుజ్జగించడం నుండి కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. అయినా ఆయన మాత్రం తగ్గడం లేదు. ఇది ఆయన ఇమేజ్‌ని సీమాంధ్రలో పెంచిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+