మంత్రివర్గం షెడ్యూల్ మార్పు - సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ : ప్రధాని- అమిత్ షా తో భేటీ..!!
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి మరి కొద్ది రోజుల్లో మూడేళ్లు పూర్తి కానుందది. కరోనా కారణంగా చాలా సమయం ఏ నిర్ణయాలకు అవకాశం లేకపోవటంతో..ఇప్పుడు వేగంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ఈ ఉగాది నుంచి కీలక నిర్ణయాల అమలుకు వరుసగా ముహూర్తాలు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం కొత్తగా 13 జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించారు. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ అంశాలతో పాటుగా ప్రధానంగా పోలవరం - ఆర్దిక అంశాల పై చర్చించే అవకాశం ఉంది. గతంలో ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానికి సీఎం జగన్ అనేక అంశాల పైన వినతి పత్రం ఇచ్చారు.

ప్రధాని మోదీ - షా తో కీలక సమావేశం
ప్రధానంగా ఈ సారి రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితితో పాటుగా సీఎంకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పోలవరం సవరించిన అంచనాల ఆమోదం పైన ప్రధానితో చర్చించనున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఈ పర్యటనలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 6వ తేదీ ఉదయం సీఎం జగన్ తిరిగి అమరావతికి చేరుకోనున్నారని చెబుతున్నారు. దీంతో..6వ తేదీన నర్సరావుపేటలో నిర్వహించాలని భావించిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమం 7వ తేదీకి వాయిదా వేసారు. దీంతో.. ఆరో తేదీన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత సీఎం జగన్.. 7వ తేదీన నర్సరావు పేటలో జరిగే వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు.

కేబినెట్ షెడ్యూల్ మార్పు
అయితే, అదే రోజున ముందుగా ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసారు. ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 11న సీఎం జగన్ తన ఎన్నికల టీం గా చెప్పుకొనే కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో..7వ తేదీన కేబినెట్ సమావేశం మధ్నాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసారు. 8వ తేదీన సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. 11వ తేదీ ఉదయం 11.31 నిమిషాలకు ఏపీ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సారి విస్తరణలో భాగంగా పూర్తిగా పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతలతో పాటుగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాల లెక్కలను సీఎం పక్కగా పాటిస్తున్నారు. ఎన్నికలకు ఇదే కేబినెట్ తో వెళ్లాల్సి ఉండటంతో ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

ఎన్నికల టీం ఎంపికలో లెక్క పక్కా
సామాజిక సమీకరణాల్లో భాగంగా కర్నూలు నుంచి బోయ వర్గానికి చెందిన జయరాములు.. తూర్పు గోదావరి నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణలను కేబినెట్ లో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రకాశం నుంచి ఆదిమూలపు సురేష్ సైతం కొనసాగుతారని చెబుతున్నా.. ఇంకా నిర్దారణ కాలేదు. కేబినెట్ విస్తరణ..ప్రస్తుత మంత్రులకు పార్టీ పరంగా అప్పగించే బాధ్యతల గురించి 7వ తేదీ జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. సీనియర్లకు రీజనల్ కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సైతం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. రాజ్యసభ సభ్యుల ఎంపిక..రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో సీఎం జగన్ ప్రధాని మోదీ - అమిత్ షా తో భేటీ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications