పవన్ దూకుడుకు కళ్లెం ? వైసీపీ కొత్త ప్లాన్ ఇదే ! కిరణ్ రాయల్ ఎపిసోడ్ తో పాఠం !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి జగన్ ను మరోసారి ఎలాగైనా అధికారంలోకి రానివ్వకుండా చేస్తానని రోజూ ప్రకటనలు చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మిత్రపక్షమైన బీజేపీతో ఎలా ఉంటున్నా.. విపక్షంలోని ఇతర పార్టీలతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటూ ఇందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు. దీంతో పవన్ ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెరదీస్తున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీపై పవన్ దూకుడు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇతర విపక్షాలతో కలిపి పావులు కదుపుతున్నారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం కోసం బీజేపీని రోడ్ మ్యాప్ అడిగిన పవన్ కు ప్రధాని మోడీ.. క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైసీపీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండానే ఇతర పక్షాల్ని ఏకం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వైసీపీపై క్షేత్రస్ధాయిలో ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో టీడీపీ కూడా పవన్ పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఏపీ రాజకీయం కాస్తా పవన్ కేంద్రంగా మారిపోతోంది.

వైసీపీ కౌంటర్ ప్లాన్ అమలు
రాష్ట్రంలో ప్రధాని విశాఖ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కు అనూహ్యంగా పెరుగుతున్న ఆదరణతో వైసీపీ కూడా అప్రమత్తమవుతోంది. పవన్ ను ఓవైపు బహిరంగంగా టార్గెట్ చేస్తూనే మరోవైపు ఆయన పార్టీ జనసేన నేతల్ని కూడా తమవైవు ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కాస్తో కూస్తో పేరు, ప్రచారం లభిస్తున్న నేతల్ని వైసీపీలోకి రమ్మని తెరవెనుక ఆహ్వానాలు పంపుతోంది. అందుకు వారు అంగీకరిస్తే సరే సరి లేకుంటే వారిని ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు తమ నియోజకవర్గాల్లో కంటగింపుగా మారిన వారిని పార్టీలో చేర్చుకుని దారికి తెచ్చుకోవడం లేదంటే టార్గెట్ చేయడమే వ్యూహంగా ముందుకెళ్తోంది.

కిరణ్ రాయల్ ఉదంతంతో
తిరుపతికి చెందిన జనసేన నేత, స్ధానిక ఇన్ ఛార్జ్ కూడా అయిన కిరణ్ రాయల్ కొంతకాలంగా వైసీపీకి కంటగింపుగా మారారు. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాను ఆయన టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయనతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. అయినా ఆయన చేరేందుకు ససేమిరా అనడంతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీలో చేరాలని లేకపోతే నీ అంతు చూస్తామని గత 15 రోజుల నుంచి నగరి సి.ఐ. వేధిస్తున్నట్లు కిరణ్ రాయల్ తాజాగా వెల్లడించారు. మంత్రి రోజా తనతో ఉన్న జనసేన నాయకులను కూడా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆయన్ను అరెస్టు చేయడం, బెయిల్ లభించినా లాక్కున్న తన ఫోన్ లో బలవంతంగా డేటా తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం చూస్తుంటే కిరణ్ రాయల్ విషయంలో వైసీపీ సర్కార్ వ్యూహం అర్ధమవుతోంది.

వైసీపీ హిట్ లిస్ట్ లో జనసేన కీలక నేతలు ?
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్దానంలో నాగబాబు లేదా నాదెండ్ల మనోహర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఎవరనే దానికి సమాధానం లేదు. కానీ క్షేత్రస్దాయిలో ఈ మధ్య కాలంలో తిరుపతిలో కిరణ్ రాయల్, విజయవాడ పశ్చిమలో పోతిన మహేష్, విశాఖలో బొలిశెట్టి సత్యనారాయణ, మూర్తి యాదవ్ వంటి నేతలు కనిపిస్తున్నారు. వీరిని ఏదో విధంగా దారికి తెచ్చుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కుదరకపోతే మాత్రం టార్గెట్ చేసేందుకు అధికార పార్టీ వెనుకాడబోదని తెలుస్తోంది. దీంతో ఆయా నేతల్ని కాపాడుకోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సవాల్ గా మారుతోంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications