వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే 2024లోనూ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి: ఆ ముహూర్తం ఖ‌రారు: ఒక అంతా అక్క‌డి నుండే..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే అప్పుడే 2024లో సీఎం ఎవ‌ర‌నే చ‌ర్చ మొద‌లైంది. 2024లోనూ తిరిగి జ‌గ‌న్ సీఎం అవుతారంటూ ఒక ప్ర‌ముఖ స్వామీజీ స‌చివాల‌యం వేదిక‌గా జోస్యం చెప్పారు. స‌చివాల‌యంలో జ‌గ‌న్ ఉండాల్సిన ముఖ్య‌మంత్రి పేషీలో..మొద‌టి బ్లాక్‌లో వాస్తు మార్పులు చేస్తున్నారు. జూన్ 8న జ‌గ‌న్ స‌చివాల‌యంలో అడుగు పెట్టే స‌మ‌యానికి ఈ మార్పులు పూర్తి చేయ‌నున్నారు.

2024లోనూ జ‌గ‌నే సీఎం..
ముఖ్య‌మంత్రి త‌న విధులు నిర్వ‌హించే కార్యాల‌యం..స‌చివాల‌యాన్ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన క‌పిలేశ్వ‌రానందగిరి స్వామి ప‌రిశీలించారు. ఆయ‌న స‌చివాల‌యంలోని మొద‌టి బ్లాక్‌ను మొత్తం ప‌రిశీలించి కొన్న సూచ‌న‌లు చేసారు. ఇప్ప‌టికే ప్రారంభించిన కొద్ది పాటి మార్పులు పూర్తి చేసి..ఇక్క‌డి నుండి పాల‌న సాగిస్తే జ‌గ‌న్‌కు తిరుగు ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసారు. స‌చివాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను క‌లిసారు. తాను జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించ‌టానికి అగ‌ర్త‌ల నుండి వ‌చ్చాన‌ని చెప్పారు. జగన్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పేదరికం లేకుండాపోతుందన్నారు. 2024 తర్వాత కూడా జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. జగన్‌ను కలిసి ఆశీర్వచనం అందిస్తానని కపిలేశ్వరానందగిరిస్వామి చెప్పారు.

]With orders of new CM Jagan officers started changes in first block according to vastu in AP sectat.

వాస్తు ప‌రంగా మార్పులు..చేర్పులు
ఏపీ సచివాలయంలో వాస్తు దోషాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాస్తు పండితుల సూచనలతో స్వల్ప మార్పులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆగ్నేయం నుంచి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌లో మార్పులు-చేర్పులు చేస్తున్నారు. అందుకోసం పాత ఛాంబర్ పక్కనే కొత్త ఛాంబర్ నిర్మిస్తున్నారు. సీఎం ఛాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రొటోకాల్‌ రూం, సందర్శకులు వేచి ఉండే గదుల గోడలు తొలగించారు. మొదటి బ్లాకులో ఉన్న చంద్రబాబు ఫొటోలను తొలగించారు. ప్ర‌స్తుతం త‌న నివాసం నుండే పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ ఈనెల 8వ తేదీ నుండి స‌చివాల‌యం నుండి పాల‌న సాగిస్తారు. అక్క‌డ వాస్తు పనుల కార‌ణంగానే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక పూర్తి స‌మ‌యం పాల‌న ద్వారా జ‌గ‌న్ త‌న తండ్రి త‌ర‌హాలోనే పాల‌న సాగించ‌నున్నారు.

English summary
Vastu changes in Ap Secretariat. With orders of new CM Jagan officers started changes in first block where cm office located. From June 8th on wards jagan start work from secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X