శ్రీవారి ఆలయంలో హైదరాబాద్ మహిళతో అసభ్య ప్రవర్తన
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుమలలో ఒకరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాదుకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చారు.
దర్శన సమయంలో శ్రీవారి సేవకుడు తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని రవికుమార్ ఆరోపించారు. విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారని ఆరోపిస్తున్నారు.
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూసమస్య పైన ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ గోనెగండ్ల మండలం పెద్దనేలటూరుకు చెందిన రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో అక్కడున్న పోలీసులు రైతును అడ్డుకున్నారు.
అగ్నిగుండంలో పడిన భక్తుడు
శ్రీకాళహస్తిలో ప్రమాదం జరిగింది. భక్తులు అగ్ని గుండంలో నడుస్తుండగా వెనుక ఉన్న భక్తుడు ముందు ఉన్న భక్తుడిని తోయడంతో అతను నిప్పుల పైన పడ్డాడు. తోటి భక్తులు అతనిని వెంటనే పక్కకు లాగి, ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications