ఆటోలో ఒంటరిగా వెళ్తున్న వివాహితపై గ్యాంగ్‌రేప్

గుంటూరు: ఆటోలో వెళ్తున్న ఒంటరి వివాహితను అడ్డుకున్న ఐదుగురు దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. లగడపాడు గ్రామానికి చెందిన ఓ వివాహిత జూన్ 15న రాత్రి సత్తెనపల్లి నుంచి ఆటోలో తన గ్రామానికి వెళ్తోంది. పెదకూరపాడు గ్రామ శివారులో ద్విచక్రవాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆటోను అటకాయించి ఆమెను పోలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

 A woman allegedly gangraped in Guntur district

ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పెదకూరపాడు ఎస్‌ఐ కొమ్మాలపాటి చంద్రశేఖర్‌ గురువారం తెలిపారు. నిందితులు సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

లారీ-బస్సు ఢీ: పలువురికి గాయాలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఊపరపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+