మంత్రి అమర్నాథ్ రెడ్డిని గుడిసెలోకి లాక్కెళ్లిన వృద్ధురాలు
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ వృద్ధురాలు మంత్రిని తన ఇంటిలోకి లాక్కెళ్లింది. తమ పరిస్థితి చూడాలంటూ ఆయనతో వాపోయింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పెద్ద పంజాణిలో సోమవారం నాడు చోటు చేసుకుంది.
ఓ అవ్వ ఏళ్లుగా తన సమస్యలను అధికారులకు చెప్పుకుంటోంది. కానీ ఆమె సమస్య తీరలేదు. సోమవారం మంత్రి అమర్నాథ్ రెడ్డి అక్కడ పర్యటించారు. అప్పటికే విసిగిపోయి ఉన్న వృద్ధురాలు మంత్రి అమర్నాథ్ రెడ్డిని కలిశారు.

ఆయన వీధిలో కనిపించగానే ఆయన వద్దకు వెళ్లి తన కష్టాలను చెప్పుకుంది. ముందు మా గుడిసె చూద్దువు రా అంటూ ఆయనను తీసుకెళ్లింది. తన గుడిసెలోకి లాక్కెళ్లింది. తన భర్తకు పింఛన్ రావడం లేదని, అది వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
చలికి వానకు గుడిసెలో ఉండలేకపోతున్నామని, రేకుల ఇళ్లయినా ఇప్పించాలని మంత్రిని ఆమె కోరింది. వెంటనే స్పందించిన అమర్నాథ్ రెడ్డి పింఛన్, పక్కా ఇళ్లు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications