దారుణం... మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం మునగపాడు గ్రామంలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై కిరోసిన్ పోసిన యువకుడు ఆమెకు నిప్పంటించాడు. దాంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని మంటలార్పారు.
ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స్ కోసం మహిళను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు.
ఆరేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం
ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ సంఘటన శనివారం పొదిలి సమీపంలోని రాజుపాలెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన చిన్నారిని అదే గ్రామానికి చెందిన కె రాజయ్య (60) అనే వృద్ధుడు తన ఇంట్లోకి పిలిచి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అక్కడి రావడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పొదిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications