దారుణం: మైనర్ బాలికకు వాతలు పెట్టిన టెక్కీ భార్య

హైదరాబాదులోని నిజాంపేట రోడ్డులో గల వర్టెక్స్ అపార్టుమెంటులోని ఓ అపార్టుమెంటులో సాఫ్టువేర్ ఉద్యోగం చేసే దంపతులునివాసముంటున్నారు. వారు మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన విజయ కుమారి అనే పదకొండేళ్ల బాలికను తమ చిన్నారి ఆలనా పాలనా చూసేందుకు, ఇంట్లో పని చేసేందుకు తీసుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో విజయ కుమారి.. చిన్నారని ఎత్తుకునే ప్రయత్నంలో కిందపడేసింది. దీంతో ఆవేశానికి గురైన తల్లి ఆమె ఒంటి పైన వాతలు పెట్టింది. ఇది గుర్తించిన అపార్టుమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కెపిహెచ్‌బి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
బాల కార్మికురాలిని అక్రమంగా పనిలో పెట్టుకోవడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసిన దంపతులపై క్రిమినల్ కేసు పెట్టి, కఠినంగా శిక్షించాలని ఎపి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications