భార్య 'వ్యభిచార' దందాను బట్టబయలు చేసిన భర్త: వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

గుంటూరు: అమాయక యువతులను వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న ఓ మహిళ బాగోతం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వెలుగుచూసింది. ఆశ్చర్యంగా.. ఆమె భర్తే పోలీసులకు ఈ విషయాన్ని లీక్ చేయడం గమనార్హం. భార్యతో తలెత్తిన వివాదాల కారణంగా అతను ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. సదరు భర్త ఇచ్చిన సమాచారం మేరకు.. అతని భార్యను విచారించగా.. వ్యభిచార దందా నిజమేనని తేలింది.

ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:

మస్తాన్‌వలి-ఆషాభి దంపతులు చాలాకాలంగా పిడుగురాళ్లలో నివసిస్తున్నారు. కొన్ని నెలల క్రితం విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించిన మస్తాన్ వలీ.. తన భార్య గురించి పోలీసులకు కొన్ని నిజాలు చెప్పాడు. ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు అనేక వాస్తవాలు తెలిశాయి.

అమాయక యువతులకు వల..:

అమాయక యువతులకు వల..:

ఉద్యోగాల పేరుతో తన భార్య అమాయక మహిళలను దుబాయ్ పంపిస్తోందని.. అక్కడే ఉంటున్న ఆమె సోదరి ద్వారా వాళ్లను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతోందని మస్తాన్ పోలీసులతో చెప్పాడు. దీంతో సీఐ బుధవారం రెబ్బమ్మను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన రెబ్బమ్మ.. ఇన్నాళ్లు తాను చేస్తున్న దందా గురించి పూసగుచ్చినట్టు వివరించింది.

బలవంతంగా వ్యభిచారం:

బలవంతంగా వ్యభిచారం:


పోలీసుల కథనం ప్రకారం.. రెబ్బమ్మ చెల్లెలు ఆషికీ కొన్నేళ్లుగా దుబాయిలోనే ఉంటోంది.అక్కడ రాజమండ్రికి చెందిన నందు అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది.

ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచారంలోకి దించి డబ్బులు సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే రెబ్బమ్మ కూడా ఉపాధి పేరుతో అనేకమంది మహిళలను దుబాయిలోని చెల్లె వద్దకు పంపి మోసం చేసింది. తీరా అక్కడికెళ్లాక.. ఆ మహిళలు బలవంతంగా వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చేది.

కొనసాగుతున్న దర్యాప్తు:

కొనసాగుతున్న దర్యాప్తు:

రెబ్బమ్మ చేతిలో మోసపోయి.. దుబాయిలో వ్యభిచార వృత్తిలో చిక్కుకుపోయిన కొంతమంది మహిళలు ఇటీవలే తిరిగి పిడుగురాళ్లకు వచ్చారు. వారిలో కొందరిని సీఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. అందులో ఓ అమ్మాయి పలు వివరాలు వెల్లడించింది.

తాను జూన్‌ నెలలో అక్కడికి వెళ్లగా జనవరిలో తిరిగి ఇక్కడికి వచ్చినట్టు చెప్పింది. 7నెలలు తనతో వ్యభిచారం చేయించారని వాపోయింది. నెలకు రూ.25వేలు ఇస్తామని చెప్పి, అవి కూడా ఇవ్వలేదని తెలిపింది. ఆ వివరాల ఆధారంగా సీఐ రెబ్బమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవలే మరో 10మంది అమ్మాయిలను దుబాయి పంపించేందుకు రెబ్బమ్మ వీసా ఏర్పాట్లలో నిమగ్నమైందని, ఈ కేసులో ఇంకా అనేకమందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+