నీలి చిత్రాలు చూపి టెక్కీ వికృతం: భార్య ఫిర్యాదు
అనంతపురం: తన భార్య పట్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేస్తున్న వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా సమావేశం పెట్టి ఆ వివరాలను వెల్లడించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిరంజీవి అనే వ్యక్తి భార్య పట్ల ఆ వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
తనను భర్త మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ తన పుట్టింటికి వచ్చేసింది. భర్తపై, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తనకు పోలీసులు న్యాయం చేయడం లేదని బాధితురాలు ఆవేదిన వ్యక్తం చేసింది.
ఆమె కథనం ప్రకారం - అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన మహిళకు యాడికికి చెందిన ఉడుముల సంజీవులు కుమారుడు ఉడుముల చిరంజీవితో నిరుడు ఫిబ్రవరిలో వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త, బంధువులు తనను వేధిస్తున్నారని బాధితురాలు చెప్పింది. భర్త శాడిస్టులా తయారయ్యాడని ఆమె ఆరోపించింది.

ప్రతి రోజూ నీలి చిత్రాలు చూపించి, తనపై వికృత చేష్టలకు పాల్పడేవాడని, పడకగదిలోని దాంపత్యం ముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి తన స్నేహితులకు చూపించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవాడని చెప్పింది. భర్త ఇంట్లో లేనప్పుడు మామ ఉడుముల సంజీవులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఈ విషయం భర్తకు చెప్తే తననే కొట్టాడని ఆమె చెప్పింది.
తాను గర్భం దాలిస్తే దాన్ని తీయించుకోవాలంటూ భర్త, అత్తామామలు బలవంతంగా తన చేత గర్భస్రావం జరిగే మాత్రలను మింగించారని చెప్పింది. ఈ బాధలు భరించలేక తాను పుట్టింటికి వచ్చినట్లు చెప్పింది. ఈ విషయాలపై తాను ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కేసు నమోదు చేసి ఇప్పటికి ఎనిమిది నెలలు దాటుతోందని చెప్పింది.












Click it and Unblock the Notifications