ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఇదిలావుంటే, తిరుపతి సమీపంలోని ముంగిలపట్టు దగ్గర గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం వాడపల్లిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది శనివారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లారీని అడ్డగించడానికి స్థానికులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications