భర్తతో గొడవ: నిప్పంటించుకుని తల్లీకూతుళ్ల ఆత్మహత్య
హైదరాబాద్: భర్తతో తగాదా కారణంగా కన్న కూతురితో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా కాలిన గాయాలతో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని మూసాపేట్ రాఘవేంద్ర సొసైటీలో గోపాల్, పార్వతమ్మ(32) నివాసం ఉంటున్నారు.

ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. వీరికి గాయత్రి(3) కూతు రు. గోపాల్ స్థానికంగా ప్లంబర్‌గా పని చేస్తుంటాడు. ఏకైక సంతానమైన గాయత్రి పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి తీవ్ర మనస్తాపానికి గురైన పార్వతమ్మ మానసికంగా కుంగిపోయి తరచూ భర్తతో గొడవపడేది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం భర్తతో చిన్నపాటి గొడవ జరిగింది. భార్యతో గొడవపడిన గోపాల్ ఇంటి నుంచి బయటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న పార్వతమ్మ త న కూతురు గాయత్రితో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో చుట్టుపక్కల వారు గో పాల్‌కు సమాచారం అందించారు. ఇంటి తలుపు లు బద్దలు కొట్టి మంటలను అర్పగా అప్పటికే పార్వతమ్మ కాలిన గాయాలతో మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న గాయత్రిని స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందింది.

పార్వతమ్మ గతంలోను రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు. కూతరు వికలాంగురాలిగా జన్మించడంతో మనస్తాపానికి గురైన పార్వతమ్మ ఒకసారి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిందని, మరోసారి ఇంట్లో నిప్పంటించుకోవడానికి యత్నించిందని, మనస్తాపంతో కల్లుకు బానిసై పిచ్చిదానిలా ప్రవర్తించేదని స్థానికులు, బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications