ఆ ఫొటోలు చూపి రమ్మన్నాడు, ఒకసారి వెళ్తే..: మాజీ ప్రియుడిపై మహిళ

చిత్తూరు: మాజీ ప్రియుడి తనను వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ప్రకాశ్‌తో బాధిత మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లయింది.

అయితే, పెళ్లికి ముందు ఆమె పవన్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లయిన తర్వాత అతన్ని దూరం పెట్టింది. అయితే అతను వదిలిపెట్టకుండా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

ఆ వీడియో చూపించి..

ఆ వీడియో చూపించి..

గతంలో తాము ఇద్దరంం సన్నిహితంగా ఉన్న వీడియో చూపించి పవన్ కుమార్ తనన వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లోని మరికొంత మంది వద్దకు తనను పంపించాలని పథకం వస్తున్నాడని చెప్పింది.

చివరకు భర్తతో చెప్పి...

చివరకు భర్తతో చెప్పి...

పవన్ కుమార్ వేధింపులు తట్టుకోలేక భర్తకు మొత్తం విషయం చెప్పి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిగ్రీ చదువుతుండగా తనకు పవన్ పరిచమయ్యాడని, కొద్ది రోజుల తర్వాత అతను మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, అది తెలిసి తాను దూరం జరిగానని చెప్పింది.

 ఇలా కూడా చేశాడు...

ఇలా కూడా చేశాడు...

ఆ తర్వాత కూడా అతను తన వెంటపడ్డాడని ఆమె చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పవన్‌ను తిట్టి పంపించేశారని, తర్వాత తనకు పెళ్లి కుదిరిందని చెప్పింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత తన ఫోన్ నెంబర్ తెలుసుకుని వేదించడం ప్రారంభించాడని చెప్పింది.

 క్లోజ్‌గా ఉన్న ఫొటోలు చూపించి.....

క్లోజ్‌గా ఉన్న ఫొటోలు చూపించి.....

తాను అతనితో అప్పట్లో సన్నిహితంగా న్న ఫొటోలు చూపించి, తనతో ఒక రోజు గడపాలని, లేకపోతే ఫొటోలు భర్తకు పంపిస్తానని పవన్ బ్లాక్ మెయిల్ చేశాడని, దాంతో భయపడి ఒక్కసారి వెళ్లి వచ్చానని, అయినా మళ్లీ మళ్లీ బెదిరిస్తున్నాడని, దాంతో తట్టుకోలేక విషయం భర్తకు చెప్పానని బాధితురాలు చెప్పింది.

భర్త సహకరించడంతో...

భర్త సహకరించడంతో...

భర్త తనకు ఎంతో సహకరించాడని దాంత పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ తన స్నేహితులతో కలిసి అమ్మాయిలను దుబాయ్ తరలిస్తాడని కూడా ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+