కొత్త కోణం: కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయిన రాణి (ఫోటోలు)
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీని పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. మృతి చెందిన రాణి కొత్త ప్రియుడితో కలిసి పాత ప్రియుడిని చంపించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీసులు నిందితులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
మృతి చెందిన రాణి భర్త నుంచి విడిపోయి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఇంకొకరికి దగ్గరైంది. పాత ప్రియుణ్ని చంపించేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో అనూహ్యంగా ఆమె ప్రాణాలే పోగొట్టుకుంది. ఈ నెల 26వ తేదీ రాత్రి జరిగిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు.
కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన రాణి ఐదు సంవత్సరాల క్రితం భర్త విక్టర్ బాబు నుంచి విడిపోయింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లికి చెందిన కటారి రాజేష్‌తో ఏడాదిగా సంబంధం కొనసాగిస్తోంది. గన్నవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ కోటా శోభనాద్రి అలియాస్ చంటి అనే వ్యక్తికి దగ్గరయింది.

కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయి
రాజేష్‌ను చంపాలని రెండు నెలల క్రితం పథకం వేసింది. 45 రోజుల క్రితం యాసిడ్‌ను సిద్ధం చేసింది. మూడుసార్లు రాజేష్‌పై హత్యాయత్నం చేసింది. సంఘటన రోజు చికిత్స కోసమంటూ రాజేష్‌ను నమ్మించి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి అతనితో కలసి వచ్చింది.

కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయి
తిరిగి వెళ్లే సమయంలో తమపై యాసిడ్ దాడి చేయాలని రెండో ప్రియుడు చంటికి ముందుగానే సమాచారం ఇచ్చింది. రాజేష్, రాణి ప్రయాణిస్తున్న బైక్‌ను మరో వ్యక్తితో కలసి విజయవాడ నుంచి వెంబడించిన చంటి గూడవల్లి వద్ద రాజేష్‌పై యాసిడ్‌పోసి పరారయ్యాడు.

కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయి
ఈ దాడిలో రాజేష్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. రాణి ముఖంపై కూడా యాసిడ్ పడింది. రాజేష్, రాణి ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. రాణి తలకు బలమైన గాయమైంది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయి
తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావించారు. మృతురాలి కుటుంబసభ్యులు మాత్రం ఆమె భర్త విక్టర్ బాబు పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయి
భర్త నుంచి విడిపోయాక రాణి తన మేనమామ కిరణ్‌తో, తర్వాత రాజేష్, శోభనాద్రి (చంటి)లతో సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది.
కొత్త ప్రియుడితో పాత ప్రియుడిని చంపించబోయి
దీంతో ఘటన జరిగిన మరుసటి రోజే శోభనాద్రితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రాజేష్ అడ్డు తొలగించుకునేందుకు రాణితో కలసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చంటి అంగీకరించాడు.












Click it and Unblock the Notifications