భోగి ఘర్షణ, మహిళ మృతి: పల్సర్‌కు నిప్పు
హైదరాబాద్: బోగి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా భోగి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తడ మండలం తడ కండ్రిగ భోగి వేడుకల్లో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది.
భోగి మంటల సందర్భంగా నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో మహిళల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.
ఈ ఘర్షణలో మునెమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణంతో పాటు విషాదం నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.

భోగి పండుగ రోజున బుధవారం చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో ఆకతాయిలు చెలరేగిపోయారు. ఓ పల్సర్ బైక్‌కు నిప్పంటించారు. దీంతో పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ షాపుకు మంటలు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువ అవడంతో షాపులోని విలువైన ఎలకి్ట్రకల్ పరికరాలు దగ్ధమైయ్యాయి.
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా గన్నవరం మడలంలో కోడిపందెం ఘర్షణకు దారి తీసింది. దంతో రెచ్చిపోయిన ఓ వరగ్ంవారు మరో వర్గానికి ెచందిన కారును దగ్ధం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా కోడి పందేలు సాగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో పందెం రాయుళ్లపై పోలీసులు కొరడా జులిపించారు. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లిలో కోడి పందాల బరులపై పోలీసులు దాడిలు జరిపారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న పలువురి అదుపులోకి తీసుకున్నారు. కోళ్లను, బెట్టింగులో పెట్టిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు.
{promotion-urls}












Click it and Unblock the Notifications