ఐదో అంతస్తు నుంచి జారిపడింది.. అయినా సేఫ్
విజయవాడ: ఐదవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ మహిళ కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివారాలిలా ఉన్నాయి. విజయవాడలోని క్రీస్తురాజుపురంలోని అరుణ అపార్ట్‌మెంట్‌లో వల్లూరు విజయలక్ష్మి(37) దంపతులు నివసిస్తున్నారు.
సోమవారం సాయంత్రం ఆమె దండేనికి ఆరేసిన బట్టలు తీస్తుండగా పట్టుతప్పి ఐదో అంతస్తులోంచి జారిపడ్డారు. అయితే మూడో అంతస్తులోని గ్రిల్స్ మధ్యలో ఆమె కాలు ఇరుక్కోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు.

ఆ తర్వాత ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో గమనించిన స్ధానికులు 108, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి హుటాహూటిని వచ్చిన వచ్చి బాధితురాలిని రక్షించిన, అనంతరం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమె చేయి, కాలు ఫ్రాక్చర్ అయ్యాయి.












Click it and Unblock the Notifications