భార్యను చంపబోతే అడ్డమొచ్చిందని అత్తను నరికి చంపాడు
విజయవాడ: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై కోపంతో అత్తపై తన ప్రతాపం చూపించాడు. గేదెను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును తనకు ఇవ్వలేదనే కోపంతో అతను ఊగిపోయాడు.
భార్యపై తగాదాకు దిగడంతో అత్త అడ్డం వచ్చింది. దాంతో అత్తను వెంటపడి తరుముతూ గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన కృష్ణా జిలల్లా పెనమలూరు మండలం వణకూరులో ఆదివారంనాడు జరిగింది.

ఇరువురికి తరుచుగా తగాదాలు
కన్నా జోజిప్రసాద్, శశిరేఖలకు పదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్లుగా వణకూరులోని సాయిపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శశిరేఖ తల్లిగారిల్లు నాగాయలంక మండలం నాచుగుం శివారు ఏసుపురం. భర్త జోజిప్రసాద్ వణుకరులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి.

మద్యం మత్తులో అతను
మద్యం మత్తులో జోజీప్రసాద్ భార్యను శారీరకంగా వేధిస్తూ వస్తున్నాడు. అనారోగ్యం కారణంగా భార్య ఈ నెల 22వ తేదీన న తల్లి కె. శివలీల (50)కు ఫోన్ చేసింది. దాంతో శివలీల ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం వణకూరు వచ్చి కూతురికి వైద్య పరీక్షలు చేయించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చారు.

పాడిగేదెను అమ్మితే వచ్చిన డబ్బులు
శశిరేఖ, జోజీప్రసాద్ ప్రసాద్ కొద్ది రోజుల క్రితం తమ పాడిగేదెను విక్రయించారు. శనివారం రాత్రి కొనుగోలుదారుడు వచ్చి శశిరేఖకు రూ.37 వేలు ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న జోజిప్రసాద్ ఆ డబ్బులు తనకు ఇవ్వాలని భార్యను అడిగాడు. దానికి ఆమె అంగీకరించలేదు. దాంతో ఆమెతో గొడవకు దిగి ఆ డబ్బును లాక్కుని బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

ఇరువురి మధ్య మరోసారి గొడవ
మద్యం తాగి వచ్చిన జోజీప్రసాద్ మరోసారి భార్యతో గొడవకు దిగాడు .చంపుతానంటూ గొడ్డలి తీసుకుని వచ్చాడు దాంతో ఆమె పరుగులు తీసింది. అయినా ఆగకుండా ఆమె వెంట పడ్డాడు. అల్లుడిని ఆపేందుకు శివలీల వెనక పరుగెత్తింది. భార్య అప్పటికే తప్పించుకుని గ్రామంలోకి చేరుకుంది. దాంతో శివమెత్తిన జోజీ శివలీల వంట పడి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ముఖంపై, తలపై గొడ్డలి వేట్లు పడ్డాయి. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.












Click it and Unblock the Notifications