కొత్త వధువు ఆత్మహత్య: భర్తను చంపాలని విషం

బుధవారంనాడు నవ దంపతులు ఇద్దరు చింతల్‌లో కాపురం పెట్టారు. భర్త శ్రీనివాస్ గ్యాస్ టెక్నీషియన్. అతను గురువారం ఉదయం దేవాలయానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి సుహాసిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె బలవన్మరణానికి కారణమేమిటనేది తెలియడం లేదు.
ఇదిలావుంటే, భర్తకు పాలల్లో విషం కలిపి ఇచ్చి చంపేందుకు ప్రయత్నించి ఓ భార్య ఉదంతం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని పెద్దకలకలూరులోని ఓ మహిళ తన భర్తను వదిలించుకోవాలని భావించింది. దాంతో చివరకు పాలల్లో విషం కలిపి చంపడానికి ఒడిగిట్టింది.
ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల కారణంగానే భార్య ఆ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications