లాడ్జీలో మహిళ దారుణ హత్య: తోడు వచ్చిన యువకుడు పరార్?
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని లాడ్జీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండుగులు లాడ్జీలో మహిళను హత్యచేసి పరారయ్యారు. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు. దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
లాడ్జీకి ఆమెతో పాటు ఓ యువకుడు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, అతను పరారైనట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నంలోని అనంతగిరిలో అక్రమంగా రవాణా చేస్తున్న 500 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు మహిళలు, డ్ర్రైవరును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

కర్నూలులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 9 మందికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. మొదటి సారి కావడంతో కోర్టు స్వల్ప శిక్షతో సరిపెట్టిందని, మరోసారి పట్టుబడితే శిక్ష తీవ్రంగా ఉంటుందని పోలీసులు నిందితులను హెచ్చరించారు. స్వల్ప శిక్షతో భైట పడటంతో నిందితులు ఊపిరి పీల్చుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం సాలూరు దగ్గర ఆటో బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలోని వాయునందన కాలనీలో విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా తాపీ మేస్త్రీ పనులు చేస్తున్న వెంకయ్య కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications