మహిళను రేప్ చేసి కారులోంచి తోసేశారు, మృతి

దుండగులు కారులోంచి మహిళను తోసేశారు. మహిళపై దుండగులు అత్యాచారం చేసి, కారులోంచి తోసేసి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆయితే, మహిళ చికిత్స పొందుతూ మరణించింది.
పోలీసులకు ఆమె తన పేరును చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, ఆమె తనది మహబూబ్‌నగర్ అని కూడా చెప్పినట్లు సమాచారం. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిదనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు సిసిటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications