తన భర్తతో అఫైర్: ఆమెను కొట్టి చంపిన మహిళ
హైదరాబాద్: తన భర్తతో అఫైర్ పెట్టుకుందనే కోపంతో ఓ గృహిణి 40 ఏళ్ల వయస్సు గల వివాహితను కొట్టి చంపింది. షామీర్‌పేట మండలంలోని తురకపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గురుస్వామి అనే వ్యక్తి భార్య తులసమ్మ నరసమ్మ అనే మహిళను తలపై కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
నరసమ్మ పండ్లు అమ్ముకుంటూ బతుకుతుంది. గురుస్వామి, నరసమ్మ లైంగిక క్రీడ సాగిస్తుండగా తులసమ్మ, ఆమె కొడుకు చూశారని, కోపంతో తులసమ్మ నరసమ్మను కర్రతో తలపై కొట్టిందని పోలీసులు చెప్పారు. నరసమ్మను కాపాడడానికి ప్రయత్నించిన గురుస్వామిని కుమారుడు శ్రీకాంత్ గట్టిగా పట్టుకున్నాడని చెప్పారు.

తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్న నరసమ్మను తులసమ్మ, ఆమె కుమారుడు ఇంటికి తరలించారని, అర గంట తర్వాత నరసమ్మ మరణించిందని పోలీసులు చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications