వద్దన్నందుకు ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన కృష్ణ (42), విజయ దంపతులు ఏడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. కార్ఖానాలోని విక్రంపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త అపార్టుమెంటు వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తూ వచ్చాడు. భార్య ఇళ్లలో పని చేసేది. ఈ క్రమంలో అమర్‌నాథ్ అనే కారు డ్రైవర్‌తో కృష్ణకు స్నేహం ఏర్పడింది.
ఆ స్నేహాన్ని ఆసరా తీసుకుని అమర్నాథ్ తరుచుగా కృష్ణ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో విజయతో వైవాహికేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన కృష్ణ నిరుడు పంచాయతీ పెట్టాడు. విజయ, అమర్నాథ్‌లను వారు మందలించారు. అయినా వారు తమ పద్ధతిని మార్చుకోలేదు.
నిరుడు మార్చి 21వ తేదీన కృష్ణ భార్యను నిలదీశాడు. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కృష్ణ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అతన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. తన భార్య విజయ, అమర్నాథ్ తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని కృష్ణ వాంగ్మూలం ఇచ్చాుడ. రెండు రోజులకే అతను మృతి చెందాడు.












Click it and Unblock the Notifications