భర్త అక్రమసంబంధంతో మనస్తాపం: భార్య ఆత్మహత్య

 Woman kills self over hubby’s illicit affairs
హైదరాబాద్: అందంగా లేదని ఉద్దేశంతో భార్యకు భర్త నిప్పు పెట్టాడనే సంఘటన కొత్త మలుపు తిరిగింది. తనకు భర్త నిప్పు ఆంటించడంతో ఆమె మంటల్లో కాలుతూ భర్తను కౌగలించుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బుధవారం మృతి చెందింది. ఈ సంఘటనతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

పి. శిరీష అనే 27 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. అయితే, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. బాధితురాలి భర్త అనుపమ్ కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శిరీష బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

శిరీష్ బంధువులు, కుటుంబ సభ్యులు అనుపమ్‌పై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. సిఎ అయిన శిరీష ఫౌండ్రీ యజమాని అయిన అనుపమ్‌ను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వారికి ఎనిమది నెలల కూతురు కూడా ఉంది. శిరీష్ తన ఒంటికి తానే నిప్పంటించుకుందని పోలీసులు చెబుతున్నారు.

ఆమెను రక్షించే ప్రయత్నంలో అనుపమ్ ఒళ్లు కాలిందని అంటున్నారు. తన వైవాహికేతర సంబంధాన్ని ప్రశ్నిస్తే బిడ్డును చంపుతానని అనుపమ్ తనను బెదిరిస్తూ వచ్చాడని శిరీష్ తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. వేరే మహిళతో అనుపమ్ సంబంధం పెట్టుకోవడంతో ఇరువురి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+