తిరుమల కొండపై అపచారం: హీరో నాగార్జునకు ముద్దు పెట్టిన మహిళ

తిరుమల: శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉండే పవిత్రమైన తిరుమల కొండపై అపచారం జరిగింది. బుధవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన సినీ నటుడు నాగార్జునకు ఓ మహిళ ముద్దు పెట్టింది. ఈ మేరకు తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం - తిరుమలలో కేవలం శ్రీవారి గోవిందనామ స్మరణే జరగాలనే నిబంధన ఉందని, కేవలం స్వామివారిని స్మరిస్తూ భక్తులు పవిత్రతను కాపాడే ప్రయత్నం చేస్తారు.

సినీ ప్రముఖులు, హీరో, హీరోయిన్లు వచ్చినప్పుడు ఇలా కొంతమంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. గతంలో హీరోయిన్‌ శ్రీయ తిరుమల వచ్చినప్పుడు కొందరు అభిమానులు ఆమెపైకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటనలు జరిగాయి.

Woman kissed Nagarjun on Tirumala hills

తాజాగా సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పాలకమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయడం కోసం బుధవారంనాడు నాగార్జునతోపాటు కీరవాణి, భారవితో తిరుమలకు వచ్చారు.

రాఘవేంద్రరావు ప్రమాణం అనంతరం బయటకు వచ్చిన సమయంలో నాగార్జునను చేసేందుకు అభిమానులు వచ్చారు. ఆ సమయంలో కొంత తోపులాట జరిగింది. నాగార్జున కారువద్దకు చేరుకున్న సమయంలో ఓ మహిళా నేరుగా వెళ్లి ఆయన చేతిని ముద్దు పెట్టుకుని, కౌగిలించుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+