జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న వృద్ధురాలి హత్య...!
విశాఖపట్నం: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ఓ ఆగంతకుడు హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న ఎనిమిది తులాల బంగారు అభరాణాలను ఎత్తుకెళ్లిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటన జిల్లాలోని భీమిలి మండలం తగరపువలస సమీపంలోని బాలాజీ నగర్‌లో బుధవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన దాని ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన అచ్చమ్మ (74) కొడుకు ఇంట్లో నివాసం ఉంటోంది. రోజులాగే కొడుకు ఆఫీస్‌కు వెళ్లగా, కోడలు బంగారం కొనడానికి నగల దుకాణానికి వెళ్లింది. మనవళ్లు ఇద్దరు కళాశాలకు వెళ్లారు.

ఈ సమయంలో ఇంట్లో అచ్చమ్మ ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు అచ్చమ్మ మెడకు కవర్ బిగించి, కత్తితో ఆమె గొంతు కోసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. నగల దుకాణం నుంచి తిరిగి వచ్చిన కోడలు రక్తపు మడుగులో పడి ఉన్న అత్తను చూసి షాక్‌కు గురైంది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అచ్చమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications