వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మో! ఏం తెలివి!!: ఈ లేడీ ఆఫీసర్‌కు దిమ్మ దిరిగే ఆస్తులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి సంపాదించిన ఆస్తులను చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. ఆమె శుక్రవారంనాడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. శుక్రవారం ఏకకాలంోల 8 బృందాలతో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

విశాఖపట్నం జిల్లాలోని ఐసిడిఎస్ కార్యాలయం సహా ప్రకాశం, నెల్లూరు (కావలి) జిల్లాల్లోనే కాకుండా బెంగళూరులోనూ దాడులు కొనసాగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఒంగోలు, అనంతపురం జిల్లాల ఎసిబి అధికారులు మిగతా చోట్ల సోదాలు చేశారు.

విశాఖపట్నంలోని ఆమె నివాసంలో రెండు గంటల పాటు ఎసిబి అధికారులు సోదాలు చేశారు. విలువైన పత్రాలను, బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలోనే కాకుండా మధురవాడ, భోగాపురం, యలమంచిలిల్లోనూ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ సోదాలు చేశారు.

ఆమెకు మొత్తం అయిదు నివాసాలతో పాలు విలువైన ప్లాట్లు, భూములు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. తండ్రి పేరు మీద కొనుగోలు చేసినట్లు చూపించి ఆ తర్వతా ఆయన తనకు బహుమతిగా ఇచ్చినట్లు విజయలక్ష్మి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం ఆమె రూ. 20 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆస్తులు ఇలా...

ఆస్తులు ఇలా...

విజయలక్ష్మికి మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో 300 గజాల స్థలంలో రెండుస్తుల భవనం, 750 గజాల స్థలంలో మరో నివాసం ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆస్తులు ఇలా...

ఆస్తులు ఇలా...

విశాఖపట్నం బక్కనపాలెం ప్రాంతంలో వేయి చదరపు గజాల స్థలం ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. సాగర్‌నగర్ కాలనీలో ఎలఐజీ - జీ నివాసాల్లో ఆమెకు ఓ ప్లాటు ఉన్నట్లు గుర్తించారు.

ఆస్తులు ఇలా..

ఆస్తులు ఇలా..

విజయలక్ష్మికి వాల్తేరు విశాఖ కంటి ఆస్పత్రి ప్రాంతంలో సౌఖ్య ఆపార్టుమెంటులో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆస్తులు ఇలా...

ఆస్తులు ఇలా...

మహిళా అధికారి విజయలక్ష్మికి తగరపువలస సమీపంలోని పోలిపల్లిలో 784 గజాల స్థలం ఉన్నట్లు కూడా ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆస్తులు ఇలా...

ఆస్తులు ఇలా...

విజయలక్ష్మికి సవరవిల్లి వద్ద 119 గజాల స్థలం, ఎలమంచిలి ప్రాంతంలోని రాగకోడూరు గ్రామంలో 2.72 ఎకరాల స్థలం ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆస్తులు ఇలా...

ఆస్తులు ఇలా...

ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలోని కనుమల్లో విజయలక్ష్మికి 2.25 ఎకరాల స్థలం ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆస్తులు ఇలా..

ఆస్తులు ఇలా..

విజయలక్ష్మికి కిల్లంపూడిలో ఓక దుకాణం, 650 చదరవు అడుగుల విస్తీర్ణంలో ఔట్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

విజయలక్ష్మి ఇలా...

విజయలక్ష్మి ఇలా...

విజయలక్థ్మి 1994లో విధుల్లో చేరారు. అనంతగిరి, హైదరాబాద్, అనకాపల్లి, భిమీలీ తదితర ప్రాంతాల్లో సిడిపిఎగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఆస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.

ఆమె ఇలా...

ఆమె ఇలా...

విశాఖపట్నం జిల్లా పర్యాటక శాఖలో విజయలక్ష్మి అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విశాఖ జిల్లా ఐసిడిఎస్ ఇంచార్జీ పీడీగా వ్యవహరిస్తున్నారు.

పిలిస్తే రావాలి..

పిలిస్తే రావాలి..

కేసు విచారణలో ఉందని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విజయలక్ష్మి విచారణాధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పారు.

దాడులు ఇలా...

దాడులు ఇలా...

శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న విజయలక్ష్మి నివాసానికి ఎసిబి డిఎస్పీ కె. రామకృష్ణ ప్రసాద్ బృందం చేరుకుని సోదాలు ప్రారంభించింది.

English summary
Officials from the Anti-Corruption raided on Friday the office and houses of M. Vijaylakshmi, a project director of Woman and Child Welfare Department and unearthed wealth “disproportionate” to known sources of her income. The total value of seized property is an estimated Rs 20 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X