భర్తను వదిలేసొచ్చిన మహిళ.. పెళ్లాడతానని ముఖం చాటేసిన ప్రియుడు

విజయనగరం: ప్రియుడి కోసం భర్తను వదిలేసిన ఓ మహిళకు నిరాశే మిగిలింది. తనను వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతనితో వెళ్లేందుకు సిద్ధమైన ఆ మహిళను కలిసేందుకు అతడు మోసం చేశాడు. ఏం చేయాలో తెలియక బాధిత మహిళ ఆందోళనకు దిగింది.

వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం సుందరాడ గ్రామానికి చెందిన వివాహిత ముత్తా పద్మను.. అదే గ్రామానికి చెందిన చిగురుకోట శివాజీ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో ఆమె న్యాయం చేయాలంటూ అతని ఇంటి ముందు బుధవా రం బైఠాయించింది.

ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. తనకు సంవత్సరం క్రితమే పార్వతీపురంనకు చెందిన ఒకతనికి వివాహం జరిగిందని, కానీ, అంతకుముందు నుంచే శివాజీతో ప్రేమ వ్యవహారం ఉండేదని తెలిపింది. దీంతో అతని చెప్పిన మాటలు విని భర్తను విడిచిపెట్టి వచ్చానని తెలిపింది.

 A woman protests against man for fraud

ఆరు మాసాలుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాట మార్చాడని, తనకు న్యాయం జరిగే వరకు శివాజీ ఇంటి వద్ద నుంచి కదలనని తేల్చి చెప్పింది.

ఈ విషయంపై పోలీసులు ప్రశ్నించగా.. బాధితురాలు పోలీసుస్టేషన్‌కు వచ్చిందని, శివాజీని పిలిపించి మాట్లాడగా పెళ్లికి నిరాకరించడన్నారు. దీంతో ఎటువంటి కేసులు వద్దని.. గ్రామ పెద్దల వద్ద తేల్చుకుంటానని చెప్పి ఆమె వెళ్లిపోయిందని చెప్పారు.

యువతి అనుమానాస్పద మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పడమరవీధికి చెందిన లావణ్య(22) అనే యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కడుపునొప్పితో బాధపడుతుంటే తానే తన కూతుర్ని ఆస్పత్రికి తీసుకు వచ్చానని లావణ్య తల్లి చెబుతోంది.

కాగా, యువతి చనిపోయి చాలాసేపయిందని వైద్యులు చెబుతున్నారు. లావణ్య తల్లికి ఐదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. లావణ్య ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తల్లే ఆమె చంపేసి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+